Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మిస్టర్ లోన్లీ' చిత్రం మంచి కథాంశంతో రూపొందినట్టు తెలుస్తోంది. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ, నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ అన్నారు. విక్కీ, కియారెడ్డి, సోనాలి వర్ధమ్, లోహిత ప్రధాన పాత్రల్లో ముక్కి హరిష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మిస్టర్ లోన్లీ'. ఎస్కెఎమ్ఎల్ మోషన్ పిక్చర్స్ నేతృత్వంలో కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను ఎం.వి.వి.సత్యనారాయణ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగాకాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ, 'ఇదొక కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమకథా చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా యువతను ఆకట్టుకునే అన్నీ అంశాలూ ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది' అని చెప్పారు. ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ఆనంద్ గారా పాల్గొన్నారు.