Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు సత్యదేవ్, తమన్నా జంటగా ఓ సినిమాని రూపొందించబోతున్నారు. కన్నడలో మంచి విజయం సాధించిన 'లవ్ మాక్ టైల్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యడానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమాలో సత్యదేవ్, తమన్నా జంటగా మెరవబోతున్నారు. ఈ విషయాన్ని దర్శక, నిర్మాత నాగశేఖర్ తెలిపారు.
ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, 'డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో రూపొందిన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు సత్యదేవ్. క తెలుగునాట తమన్నాకి ఉన్న స్టార్డమ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో కన్నడలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'లవ్ మాక్ టైల్' సినిమాని తెలుగులో నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తున్నాం. సెప్టెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు : భావన రవి, నాగశేఖర్.