Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వ్యాప్తికి ముఖ్యంగా వ్యక్తిగత దూరంతో పాటు మాస్క్లు ధరించకపోవటం ఒక ప్రధాన కారణం. షాపుల వద్ద, మాల్స్ వద్ద అనేక దుకాణాల వద్ద దూరాన్ని పాటించకపోవటం ఒకటిగా చెప్పవచ్చు. పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో డాక్టర్లు సైతం ఈ కరోనా భారిన పడుతున్నారు. నిబంధనలు అతిక్రమించి ద్విచక్ర వాహనదారులు ముగ్గురు నలుగురు ప్రయాణిస్తున్నారు. ట్యాక్సీలలో సైతం నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్నారు. ఉత్సవాల పేరిట కొందరు ట్రాక్టర్లపై ప్రయాణించి ప్రమాదాలపాలైన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల కాలంలో తొలుత కరోనా తీవ్రతలేని జిల్లాలు గ్రీన్జోన్లకు వెళ్లి ఇప్పుడు రెడ్జోన్లుగా చేరటం జరుగుతుంది. తగ్గుముఖం పట్టినట్టు అనిపించినా తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. దీన్ని అధిగమించటానికి ప్రతి ఒక్కరు వ్యక్తిగత క్రమశిక్షణతో మెలగాలి. అప్పుడే నియంత్రించవచ్చు. ప్రతిదానికీ ప్రభుత్వంపై నిందలు తగదు. కొన్ని ప్రభుత్వాలు తొలుత విచ్చలవిడిగా వదిలి ఇప్పుడు బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి.
అయినా రఘురామారావు, ఖమ్మం.