Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు సరికాదు. తెలంగాణ రాష్ట్రంలో వివిధశాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడం ఏ విధంగా న్యాయం? ఇది ముమ్మాటికీ రాష్ట్రంలో ఉన్న సుమారు 25లక్షల మంది నిరుద్యోగులను మోసగించి నట్టే అవుతుంది. కొద్ది మంది ఉద్యోగ సంఘాల లీడర్ల ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వానికి సబబు కాదు. వీలైతే వయోపరిమితి పెంచే జీవో నెం. 109ని ప్రతి నోటిఫికేషన్‌కు అమలు చేయండి. తద్వారా, ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు వయస్సు దాటిపోతున్న నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. ఉద్యోగుల వయోపరిమితి పెంచి లక్షలాదిమంది నిరుద్యోగుల పొట్ట కొడితే మాత్రం వారి ఆగ్రహానికి గురికావడం తథ్యం. ఇది దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకటనను ఉపసంహ రించుకోవాలి.
- శ్రీనివాస్ చిరిపోతుల,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా.