Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యక్తిగత సంభాషణల నిమిత్తం ఆరంభమైన వాట్సాప్ పూర్తిగా వ్యక్తులు వారి వారి కాంట్రాక్ట్ లిస్టులో ఉన్న నెంబర్లతో మాత్రమే సంభాషించే అవకాశాన్ని కల్పిస్తుంది. పరిచయస్తులతో మాత్రమే మన అభిరుచులు ఇష్టా ఇష్టాలపై ఆధారపడి సంభాషించుకునే అవకాశమున్న ఓ రకమైన గోప్యత కల్పించే సామాజిక మాధ్యమం. దేశంలో కొన్ని కోట్ల సంఖ్యలో జనాలు ప్రస్తుతానికి వాట్సాప్ సేవలు పొందుతున్నారు. అయితే వాట్సాప్ తీసుకుని వచ్చిన నూతన మార్గదర్శకాలు వినియోగదారుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి.
2014 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ వాట్సాప్‌ను కొనుగోలు చేసి రెండూ విలినమైనాయి. నాడు చేసుకున్న ఒప్పందం ప్రకారం వాట్సాప్ వినియోగదారుల సమాచారమూ, సంభాషణలకు సంబంధించిన ఏ విషయమూ ఫెస్బుక్తో భాగస్వామ్యం చేసుకోబోమని నాడు వాట్సాప్ చేసుకున్న ఒప్పందంలో ఉన్నది. ఇప్పుడు ఉన్నపళంగా నూతన మార్గదర్శకాలు వినియోగదారులు ఒప్పుకోకపోతే 26రోజుల్లో మీ ఖాతా తొలగించబడును అని వాట్సాప్ తన వినియోగదారుల మీద దౌర్జన్యానికి తెగబడింది. నాడు ఒప్పందంలో వినియోగదారుల సంభాషణలు ఇతరేతర విషయాలకు హామీ ఇచ్చినట్టే ఇచ్చి నేడు పెడదోవ పడుతున్న వాట్సాప్ మీద ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తి చాలా మంది తమ తమ ఖాతాలు తొలగించి తమ అసంతప్తిని వెల్లడించారు. సిగల్ టెలిగ్రామ్ వంటి స్వదేశీ మెసేజింగ్ యాప్‌ల వాడకం డౌన్లోడుల సంఖ్య గత వారంలోనే లక్షకు ఎగబాకినట్టు డేటా అనాలిటిక్స్ సంస్థ పేర్కొన్నది. గత వారంతో పోలిస్తే వాట్సాప్ డౌన్లోడ్ల సంఖ్య గణనీయంగా 11శాతం దిగజారినట్టు అదే సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త మార్గదర్శకాలు ఒప్పుకోకపోతే ఖాతా తొలగిస్తాం అనే ఒంటెద్దు పోకడ వినియోగదారుల ఆగ్రహానికి కారణమై వాట్సాప్ ఖాతాల తొలగింపు పెద్ద సంఖ్యలో పెరగడానికి కారణమైంది. వ్యాపారాలు నిర్వహించే సంస్థలు వినియోగదారుల సంభాషణల చౌర్యం జరిపి వారి మనసుల్ని వారి వ్యాపారాలకు అనుకూలంగా దారిమళ్లించేే అవకాశం ఉందని, ఫెస్బుక్ డేటాను అప్పనంగా వినియోగదారుల నుంచి లాగి తమ లాభం కోసం థర్డ్ పార్టీ వ్యాపారులకు అప్పగించి లాభాలు ఆలోచించే దుర్మార్గపు చర్యకు దిగుతోందని వ్యాపార రంగంలో నిపుణులు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుండగా తాము వినియోగదారుల లొకేషన్ గానీ, సంభాషణలు కానీ చూడమని, సంభాషణలన్నీ ఎప్పటికప్పుడు ఎంక్రీట్ప్ అవుతాయని వాట్సాప్ చెబుతోంది.
దిద్దుబాటు చర్యలను ప్రారంభించిన వాట్సాప్ గత రెండ్రోజుల నుంచి తమ బ్లాగులో వినియోగదారులకు కనిపించేలా తాము వినియోగదారుల సంభాషణలు చూడమని, అవి ఎప్పటికప్పుడు ఎంక్రిప్టు అవుతాయని, లొకేషన్ కూడా అందుబాటులో ఉండదు అని క్షమాపణలు కోరుతోంది. అయితే యూరప్ వినియోగదారులకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని వాట్సాప్ తన మాతసంస్థ అయిన ఫేసుబుక్‌తో పంచుకోదని అక్కడి వాట్సాప్ కార్యనిర్వాహక అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఫేసుబుక్‌తో సమాచారాన్ని పంచుకోవడం వలన ప్రకటనలతో వినియోగదారుల మనసు మళ్లించే ప్రమాదం ఉంది. కాబట్టి యూరప్ ఖండంలో ఈ సమాచారం ఖచ్చితంగా పంచుకోవాలనే నిబంధనలు ఏమీ లేవని వారు అంటున్నారు. అయితే యూరపులో ఒకరకంగా మిగిలిన దేశాల్లో ఒకరకంగా వ్యవహరిస్తూ తన వ్యాపార ప్రయోజనాలు ఫేస్బుక్ కాపాడుకుంటుందని ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- పి. నాగఫణి,
సెల్: 8074022846