Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలకు టీకా మందులు, పోష కాహార అవసరాన్ని తెలియ జేస్తూ, బాలలు తమ బాల్యాన్ని ఉల్లాసంగా, ఆనందంగా గడుపుతూ ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో పనిచేసే సంస్థ యునిసెఫ్. ఈ సంస్థ విధానాలు, కీలక నిర్ణయాలు ఇక్కడి నుంచే తీసుకుంటారు. యునిసెఫ్ ఐక్యరాజ్యసమితిలో భాగం. ప్రత్యక్షంగా పిల్లల కోసం పనిచేసే అతిపెద్ద ప్రపంచ సంస్థ. 'యునెసెఫ్ డే'ను ప్రతి యేటా డిసెంబర్ 11న జరుపుకుంటారు. వివిధ యుద్ధాలలో ఓటమి చవిచూసిన దేశాలలోని పిల్లలకు సంఘీభావంగా వారిలో మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని అందించడంలో సహకరిం చేందుకుగాను రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యు.ఎన్.ఓ. జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యునిసెఫ్) సంస్థను ఏర్పాటు చేసింది. 1940 నాటి ఆహార వైద్య సంక్షోభం ముగిసిన తర్వాత బాధిత దేశాలలోని పిల్లల సహాయ సంస్థగా యునిసెఫ్ తనవంతు పాత్రను పోషిస్తుంది. పిల్లల హక్కుల కన్వెన్షన్ ముసాయిదా తయారీలో 1980లో యునిసెఫ్ యుఎన్ఓ మానవహక్కుల కమిషన్‌కు సహకరించింది. 1989 యుఎస్ జనరల్ అసెంబ్లీకి పరిచయం తర్వాత పిల్లల హక్కుల కన్వెన్షన్ ఆత్యంత విస్తృతమైన మానవ హక్కుల ఒప్పందంగా చరిత్రలో నిలిచిపోగా, ఇందులో యునిసెఫ్ ప్రధానపాత్ర పోషించింది. 183 ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలలో కేవలం సోమాలియా, అమెరికా దేశాలు మాత్రమే ఒప్పందం అమలులో విఫలమయినాయి. సోమాలియాకు అంతర్జాతీయ గుర్తింపుగల ప్రభుత్వం లేకపోవడంతో ఒప్పందం అమలు సాధ్యం కాలేదు. యునిసెఫ్ 1946 డిసెంబర్ 11న యు.ఎన్.ఓ. జనరల్ అసెంబ్లీలో ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా జాతి, మత, రాజకీయ వివక్షలేని అవసరాలలో ఆధారంగా పిల్లలకు సహాయపడాలన్నది యునిసెఫ్ లక్ష్యం. 1947 నుంచి 1950 వరకు రెండవ ప్రపంచ యుద్ధకాలంలో క్షతగాత్రులైన పిల్లలకు సహాయం అందించడమే తమ ధ్యేయంగా పనిచేసింది. సుమారు 40 కోట్ల టన్నుల పాలు, దుస్తులు, చైనాలోని పిల్లలకు అందించింది. క్షయవ్యాధికి 'రెడ్‌క్రాస్' సహకారంతో టీకాలు వేయించింది. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణ అమెరికాలోని వర్ధమాన దేశాలలో యునిసెఫ్ తన పనులను ప్రారంభించింది. 1953లో యునిసెఫ్ సుదీర్ఘ చర్చల అనంతరం యు.ఎన్.ఓ. జనరల్ అసెంబ్లీ యునిసెఫ్ శాశ్వత మనుగడకు ఓటువేసింది. దాని పేరు నుంచి అంతర్జాతీయ ఎమర్జెన్సీ అన్న పదాల్ని పూర్తిగా తొలగించింది. కానీ యునిసెఫ్ అన్నది అలానే ఉంది. ప్రస్తుతం యునిసెఫ్ 150 దేశాలలో పనిచేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి కమిటీల ద్వారా నిధులను సేకరిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. దోపిడీ నిర్లక్ష్యం, అత్యాచారాల నుంచి రక్షణ, ఆరోగ్య రక్షణ, ప్రతి విద్యార్థికి విద్య అందేలా యునిసెఫ్ కృషిచేస్తుంది. భూకంపాలు, సునామీలు, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు యునిసెఫ్ సహాయ, సహకారాలు అందిస్తుంది. అనారోగ్యం, మరణాలు, వ్యాధుల బారిన పడే పిల్లలసంఖ్య తగ్గించడంలో ఇతోధికంగా కృషిచేస్తుంది.
కె. సతీష్‌రెడ్డి
సెల్: 9848445134