Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''చేప నీళ్ళు తాగటం, ప్రభుత్వోద్యోగి లంచం తీసుకోటం చూడలేం.'' చాణక్యుడు క్రీ.పూ.3వ శతాబ్దంలోనే ఈయన 40రకాల నిధుల దుర్వినియోగాలు వర్ణించారు. ''అవినీతి అవినీతిని ప్రసవిస్తుంది. శిక్ష మినహాయింపు సంస్కతిని పెంచుతుంది.'' ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియొ గుటెరస్.'' ఉద్యోగులు నీతి తప్పుతారని భయపడేవాడిని. రక్షణ, మినహాయింపులతో అధికారులే అవినీతిపరు లయ్యారు.'' పూర్వ పౌర అధికారి, తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్ కీ.శే. పి.సి. అలెగ్జాండర్.
న్యాయవ్యవస్థ, బ్యాంకులు, నిఘా, దర్యాప్తు, రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్థల్లో ప్రభుత్వ జోక్యం, చారువాలా సుళ్ళు, ప్రయివేటు సంస్థల అధిపతులు ప్రభుత్వ ఉద్యోగాల్లో, పాలనలో ఉండటం అవినీతి. పొంగూరి నారాయణ, సుజనా చౌదరి, బీజేపీ కామినేని శ్రీనివాస్ ఈ కోవవారే. అవినీతిని ప్రజలు జీవనశైలిగా పరిగణిస్తున్నారు. నీతివంతులను వింతగా చూస్తున్నారు. బహుళ రూపాల అవినీతి నిర్వచనం అతికష్టం. కళంక నిష్కళంకతల విభజనరేఖ అస్పష్టం. లంచగొండులకు అన్నీ సమకూరుతాయి. ఉద్యమకారులకు డబ్బే ప్రధాన సమస్య. అవినీతి నష్టాలు తరతరాలకు సంక్రమిస్తాయి. అవినీతి రాజకీయ, సామాజిక, ఆర్థిక దుస్సంఘటనల సమాహారం. సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక అభివద్ధిని, ప్రజాస్వామ్య వ్యవస్థలను, పరిపాలనా స్థిరత్వాన్ని బలహీనపరుస్తుంది. విద్య, ఆరోగ్యం, న్యాయం, సంక్షేమం, ప్రజాస్వామ్యాలపై ప్రభావం చూపుతుంది. బలహీనుల మౌలిక సౌకర్యాలు, అవకాశాలు తిరస్కరించ బడతాయి. జీవితాలు కుచించుకు పోతాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. మార్కెట్లను వక్రీకరిస్తుంది. జీవన నాణ్యత దెబ్బతీస్తుంది. వ్యవస్థీకత నేరాలను, తీవ్రవాదాన్ని, జీవన అభద్రతలను ప్రోత్సహిస్తుంది. అక్రమ లావాదేవీలు, మాదక ద్రవ్యాల రవాణా, మహిళల అపహరణ, వన్య మగాల హింస, ప్రకతి వనరుల దురుపయోగం, పర్యావరణ విధ్వంసాలను పెంచుతుంది. ఈ సంఘటనలు పెద్ద చిన్న, ధనిక పేద అన్ని దేశాల్లో ఉన్నాయి. అభివద్ధి చెందుతున్న దేశాల్లో వీటి ప్రభావం వినాశకరం. నిధులన్నీ సంపన్నుల పాలవుతాయి. పేదలకు ప్రాథమిక సేవలు అందవు. ప్రభుత్వాలు సంపన్నవర్గ పక్షం వహించటంతో అట్టడుగు జనాలు అసమానతలు, అన్యాయాలకు గురవుతారు. ఆర్థిక ప్రగతి, పేదరిక నిర్మూలన దూరమవుతాయి.
ఐరాస అవినీతి వ్యతిరేక సమావేశం 31.10.2003న నిర్వహించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9న 'అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం', మ్లోండి కలుజా పుట్టిన రోజు జరపాలని నిర్ణయించారు. '2030 నాటికి సుస్థిర అభివద్ధి' లక్ష్య సాధన ఐరాస ఉద్దేశం. ఈ ఒప్పందంలోని ఐదు ప్రధాన అంశాలు: 1.అవినీతి నిరోధక చర్యలు 2.చట్టాల అమలు 3.అవినీతి తగ్గింపునకు అంతర్జాతీయ సహకారం 4.ఆస్తుల స్వాధీనం, స్వంతదేశాలకు అప్పగింత 5.సాంకేతిక సరఫరా, సమాచార మార్పిడి. ఇందులో 186 దేశాలున్నాయి. భారత్ 09.05.2013న తన సమ్మతి తెలిపింది. మన అవినీతి నిరోధక సంస్థలు కేంద్ర నిఘావిభాగం (సివిసి), ప్రభుత్వ సంస్థల శాఖ (డీపీఈ), ఎన్నికల కమిషన్, శాసన, న్యాయ మంత్రిత్వ శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పాలకపక్షం వహించి అవినీతిని పెంచిపోషిస్తున్నాయి.
ప్రపంచవ్యాపితంగా రూ.256లక్షల కోట్ల లంచాలు ఇవ్వబడుతున్నాయని ఐరాస అంచనా. ప్రపంచ జాతీయోత్పత్తిలో ఇది 5శాతం. 90శాతం స్కోర్‌తో డెన్మార్క్ అతి తక్కువ అవినీతి దేశం. 81శాతంతో అమెరికాది 10వ స్థానం. చైనా, బ్రెజిల్, బెలారూస్లతో పాటు భారత్ 40శాతంతో 79వ స్థానంలో ఉంది. రష్యాలో స్నో రివల్యూషన్, అమెరికాలో ఆక్యుపై వాల్ స్ట్రీట్, అరబ్‌లో అరబ్ స్ప్రింగ్ నిరసనలు అవినీతి వ్యతిరేక పోరాటాలేనని అమెరికా రాజకీయ శాస్త్ర ఆచార్యులు అలిసన్ బ్రిస్క్ అన్నారు. అభివద్ధి చెందుతున్న దేశాలలో అభివద్ధి ఖర్చుకు 10రెట్ల నిధులు అవినీతి పాలవుతున్నాయి. ఏలికలకు సమస్యలు, లోపాలు, పరిష్కారాలు తెలుసు. అన్నీ చేస్తామంటారు. చేయరు. 2005లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అధ్యయనంలో భారత్‌లో 62శాతం ప్రజలు లంచాలు ఇవ్వవలసి వచ్చిందని, పలుకుబడి, డబ్బులేనిదే ఉద్యోగాలు రావని తేలింది. సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ (సీఎమ్ఎస్) ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బంగ, ఢిల్లీ, తమిళనాడు, బిహార్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో అవినీతి సర్వే నిర్వహించింది. మే నెలలో2018 వార్షిక నివేదిక విడుదల చేసింది. గతేడాది భారత్‌లో అవినీతి పెరిగిందని, గుజరాత్, తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు, ఏపీ అత్యంత అవినీతి రాష్ట్రాలని తేలింది. ఏపీలో రెవెన్యూ, పోలీసు, మునిసిపల్ కార్పొరేషన్లు అత్యంత అవినీతి విభాగాలు.
అవినీతితో లాభపడిన ప్రజలు అవినీతిని బయటపెట్టరు. బాధితులు భయపడతారు. అవినీతి ఆమోదనీయం కాదు. నైతికత, అవినీతి, అవినీతి వ్యతిరేక పోరాటం, విద్య ఆరోగ్య హక్కుల పట్ల యువతను చైతన్యపరచాలి. పారదర్శక వాణిజ్యం ప్రజాస్వామ్యానికి మూలం. స్థిర సమ్మిళిత అభివద్ధికి ప్రభుత్వ ప్రయివేటు రంగాలలో పారదర్శకత, సమగ్రత, నిజాయితీ, సుపరిపాలనలను ప్రోత్సహించాలి. అవినీతి వ్యతిరేక నిరోధక చట్టాలు, నిఘా కార్యకర్తల, ప్రజాపక్ష పాత్రికేయుల, సాక్షుల రక్షణ చట్టాలు అమలుచేయాలి. కార్పొరేట్ నేరనిరోధ బాధ్యతను, శిక్షాస్మతిని, నిందితుల పరిరక్షణ చట్టాలను, సమాచార స్వేచ్ఛను, న్యాయమూర్తుల, న్యాయవాదుల, ప్రజాసేవకుల ప్రవర్తనా నియమావళిని క్రమబద్ధీకరించాలి. విద్యార్థులు, యువకులు, మహిళలకు ఈ ప్రక్రియల అవగాహన కల్పించాలి. చట్ట పరిరక్షణ, ప్రజా సంక్షేమాల, మానవ హక్కుల, స్వేచ్ఛాస్వాతంత్రాల రక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. న్యాయమూర్తుల, న్యాయవాదుల, న్యాయవ్యవస్థ సిబ్బంది స్వతంత్రత, నిష్పక్షపాత ధోరణి, సామాజిక స్పహ, సమగ్రతలను ప్రోత్సహించకుండా ఈ బహత్కార్యం నెరవేరదు. సుపరిపాలన స్వభావాన్ని, ప్రజా విశ్వసనీయతను ప్రభావితం చేసే ప్రజాసంస్థల క్రియాశీలత, పారదర్శకతలను పెంచాలి. నల్ల సంపాదన స్వర్గధామాలను నిరుత్సాహపరచాలి. అపహరించబడిన ఆస్తుల స్వాధీనానికి వ్యవస్థలు నెలకొల్పాలి. క్రీడల్లో రాజకీయుల, సంపన్నుల భాగస్వామ్యాన్ని తగ్గించాలి. ఆటగాళ్ళ పాత్రను పెంచాలి. పందాలు, జూదాలు, క్రీడాకారుల మోసాలు, కొనుగోళ్ళకు స్వస్తిపలకాలి. క్రికెట్ అంతర్జాతీయ పోటీలను నిషేధించాలి. జాతీయ క్రీడలను ప్రోత్సహించాలి. అవినీతి తిరస్కారం ఘననీయమైనదని గుర్తించాలి. అవినీతి వ్యతిరేక, నిరోధక చట్టాలు, ప్రభుత్వాల వాగ్దానాలు, చర్యలు, ప్రభుత్వాల, అధికారుల బాధ్యతలు ప్రజలకు, విద్యార్థులకు, యువతకు తెలియజెప్పాలి. ఆచరణ పద్దతులు వివరించాలి. అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థుల, యువకుల సామాజిక మాధ్యమాల అలవాటును ప్రచారానికి వాడుకోవాలి. అవినీతి సంఘటనల పట్ల అప్రమత్తతో మెలగటం. ధైర్యంగా అవినీతి ఘటనలను నివేదించటం. అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని సమర్థించాలి. ప్రోత్సహించాలి. వివిధ విభాగాల పనితీరులో పారదర్శకతను డిమాండ్ చేయాలి.
2017 అవినీతి వ్యతిరేక దినాన ఐరాస అభివద్ధి, అవినీతి నిరోధక సంస్థలు అవినీతి పట్ల అవగాహన పెంచటానికి, అవినీతిని అరికట్టటానికి ప్రపంచవ్యాపిత ఉద్యమానికి పిలుపునిచ్చాయి. 'అవినీతి నిరోధం, అభివద్ధి, శాంతిభద్రతలకు ఐక్యత' అన్న నినాదాన్నిచ్చాయి. ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థలు, ప్రజలు సంయుక్తంగా ఈ సమస్యను అధిగమించాలని నివేదించాయి. మన అవినీతి వ్యతిరేక చర్యలు మానవత్వ ప్రగతికి, స్థిరమైన ఆరోగ్యకర ఆనంద దేశానికి పునాది వేస్తాయి. మనం నిస్తబ్ద, నిరాసక్తతలను వదిలితే అవినీతి తప్పక పారిపోగలదు.
ఎస్. హనుమంతరెడ్డి
సెల్:9490204545