- మూడున్నర ఏండ్ల నుంచి అదే తీరు! - పట్టణ ప్రజలకు అవస్థలు నవతెలంగాణ-ఎల్లారెడ్డి మూడున్నర సంవత్సరాల నుంచి ఎల్లారెడ్డి రహదారి మరమ్మతులు అసంపూర్తిగానే మిగిలిపోతున్నాయి. ఎల్లారెడ్డి డివిజన్ లోని ప్రధాన రహదారి పట్టణ ప్రజలకు పలు అవస్థలకు గురిచేస్తుంది. కనీస సౌకర్యమైన రోడ్డు లేక పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాక ముందు ఉన్న పరిస్థితి కంటే ఇంకా చాలా వెనుకబడి ఉన్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడి మూడున్నర సంవత్సరాలు గడిచినా ప్రధాన రహదారికి ఎల్లారెడ్డి పట్టణం నోచుకోలేదు. ఎల్లారెడ్డి నూతనంగా డివిజన్ అయినప్టపికీ ఇంకా రోడ్డు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రధాన రహదారియే ఇలా ఉండడం సిగ్గు చేటని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పనులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.