నవతెలంగాణ-భిక్కనూర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. శనివారం రాజంపేట గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు గుర్రాల రవి పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్థానిక మహి ళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా రవి మాట్లాడుతూలో దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిమతాల వారిని గౌరవిస్తూ దుస్తులు పంపిణీ చేస్తుందని, ఇది టీఆర్ఎస్ పార్టీకే సాధ్యమైం దన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.