నవతెలంగాణ-బీర్కూర్
బీర్కూర్ ఉమ్మడి మండలంలోని నసురుల్లాబాద్, బీర్కూర్ మండల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ పదవి రిజర్వేషన్లను బీర్కూర్ ఎంపీడీవో హరి సింగ్ విడుదల చేశారు. నసురుల్లాబాద్ మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.. లింగంపల్లి తండా ఎస్టీ మహిళ, రాముల గుట్టతండా ఎస్టీ జనరల్, ఆంకోల్ తండా ఎస్టీ జనరల్, బొప్పాస్పల్లి ఎస్సీ మహిళ, సంగం ఎస్టీ మహిళ, ఆంకోల్ ఎస్సీ జనరల్, మైలారం ఎస్సీ మహిళ, బస్వాయిపల్లి బీసీ మహిళ, దుర్కి బీసీ జనరల్, హజీపూర్ జనరల్, మిర్జాపూర్ జనరల్ మహిళ, నాచుపల్లి జనరల్ మహిళ, నసురుల్లాబాద్ జనరల్, ఆంకోల్ జనరల్, బొమ్మన్ దేవ్పల్లి జనరల్, కంశేట్పల్లి జనరల్ మహిళ, నెమ్లి జనరల్ మహిళ రిజర్వేషన్లను ఖరారు చేశారు.
బీర్కూర్ మండలంలోని రిజర్వేషన్..
బీర్కూర్ తండా ఎస్టీ మహిళ, మల్లాపూర్ ఎస్టీ మహిళ, వీరపూర్ ఎస్సీ, దామరాంచ బీసీ, బరంగేడ్జి బీసీ మహిళ, కిష్టాపూర్ బీసీ జనరల్, తిమ్మాపూర్ జన రల్ మహిళ, అన్నారం జనరల్, చించొలి జనరల్, భైర పూర్ జనరల్ మహిళ, బీర్కూర్ జనరల్ మహిళ, రైతు నగర్ జనరల్ రిజర్వేషన్లను జిల్లా అధికారులు గెజిట్ కోసం పంపినట్టు తెలిపారు.
Authorization