నిద్రించే సమయంలో గర్భిణులు చాలా అప్రమత్తంగా ఉండాలి. గర్భస్థ శిశువుకు ఎలాంటి హాని కలగకుండా పలు జాగ్రత్తలు పాటించాలి. గర్భిణులు కుడివైపు తిరిగి పడుకుంటే గర్భంలో ఉన్న బిడ్డకు ప్రమాదకరమని పరిశో ధకులు అంటున్నారు. గర్భిణులు తీసుకునే జాగ్రత్తలను అనుసరించే సుఖ ప్రసవం, సిజేరియన్ అనేవి ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. గర్భిణులు వెల్లకిలా కాకుండా ఒక పక్కకు తిరిగి పడుకోవాలని, ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల తల్లి రక్త నాళాలు చక్కగా పనిచేస్తాయని అంటున్నారు. అంతేకాదు.. దీని వల్ల బిడ్డకు, తల్లికి మధ్య రక్త ప్రసరణ చక్కగా ఉంటుందని గుర్తించారు.