అంటే... గుండెకు, మెదడుకు వెలుపల ఉండే రక్తనాళాలు వ్యాధిగ్రస్థమైనప్పుడు తలెత్తే రుగ్మత. జీర్ణకోశం, మూత్రపిండాలు, కాళ్లూచేతులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు కుంచించుకోవడం దీని ప్రధాన లక్షణం. ఈ రుగ్మత ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. 1. ఫంక్షనల్, 2. ఆర్గానిక్. ఫంక్షనల్ పెరిఫెరల్ వాస్క్యులార్ డిసీజ్‌లో ఎలాంటి స్పష్టమైన కారణం కనిపించదు. రక్తనాళాల నిర్మాణంలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోవు. ఈ వ్యాధి సాధారణంగా తాత్కాలికంగా ఉంటుంది. ముఖ్యంగా బిగుసుకుపోయినట్లు ఉండే నొప్పి (స్పాజమ్) వల్ల ఈ వ్యాధి వచ్చి పోతుంటుంది. రేనాడ్స్ వ్యాధిని దీనికి ఉదాహ రణగా పేర్కొనచ్చు. శీతల వాతావరణం, భావోద్రేకాల ఒత్తిడి, ధూమపానం, వైబ్రేషన్‌తో కూడిన యంత్రాలపై పని చేయడం తదితర అంశాలు ఈ వ్యాధికి ఉత్ప్రేరకాలుగా పని చేస్తాయి.
ఆర్గానిక్ పెరిఫెరల్ వాస్క్యులార్ డిసీజ్‌లో రక్తనాళాల్లో మార్పులు చోటుచేసు కుంటాయి.
ఇన్ఫ్లమేషన్కు గురికావడం, కణజాలం నశించడం లాంటి మార్పులు కలుగుతాయి. దీనికి పెరి ఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఒక ఉదాహరణ. ధమనుల్లో కొవ్వు చేరడం వల్ల రక్తనాళాల లోపలి భాగం సన్నగా మారి రక్త ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. తద్వారా ఈ వ్యాధి వస్తుంది.
పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్
పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి కూడా గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే కరొనరీ ఆర్టరీలకు వచ్చే వ్యాధి వంటిదే. దీని కారణంగా ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది. ముఖ్యంగా మూత్రపిండాలు, జీర్ణకోశం, కాళ్లూ చేతులు, పాదాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో ఈ సమస్య తలెత్తుతుంది. ఈ వ్యాధి వచ్చిన తొలిదశలో నడుస్తున్న సమయంలో కాళ్లలో, నడుము భాగంలో నొప్పి ఉంటుంది. ఇది విశ్రాంతితో తగ్గు తుంది. ఇటువంటి స్థితిని వైద్యపరిభాషలో 'ఇంటర్ మిటెంట్ క్లాడికేషన్' అంటారు. ఈ వ్యాధికి గురైన వ్యక్తుల్లో గుండెకు, మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో కూడా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు. ఈ స్థితి ఏర్పడినప్పుడు రోగి గుండెజబ్బుతో మరణించొచ్చు. లేదా పక్షవాతానికి గురి కావచ్చు.
నిర్ధారణ
వ్యాధికి సంబంధించిన ఇతివృత్తాన్ని తెలుసుకోవడం, రోగిని శారీరకంగా పరీక్షించడం దీన్ని గుర్తించడానికి మొదటి మెట్టు. ఆ తర్వాత అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే యాంజియోగ్రఫీ, ఎంఆర్ఏ పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
ఏం చేయాలి?
పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధికి గురైన అనేకమంది రోగులకు వారి జీవన విధానాల్లో మార్పులు తీసుకు రావడం ద్వారా వ్యాధిని నయం చేయొచ్చు. అంతేకాదు.. వ్యాధి వచ్చే అవకాశాలనూ గణనీయంగా తగ్గించొచ్చు.
- ధూమపానం అలవాటు ఉన్న వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి ధూమపానానికి
- మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి.
- అధిక రక్త పోటును నియంత్రించుకోవాలి.
- శారీరకంగా చురుగ్గా ఉండాలి.
- కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
- పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి చికిత్సకు కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా నడకను మెరుగు పరచడానికి కొన్ని మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే యాంటిప్లేట్లెట్ ఏజెంట్స్, కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి మందులు వాడాల్సి ఉంటుంది.
- కొద్దిమంది రోగుల్లో మాత్రం వారి జీవన శైలిలో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. కొన్ని కేసుల్లో యాంజియోప్లాస్టీ, శస్త్ర చికిత్స వంటివి అవసరమవుతాయి.
- యాంజియోప్లాస్టీ అనేది శస్త్ర చికిత్సతో అవసరం లేకుండా రక్తనాళంలో ఏర్ప డిన అడ్డంకిని తొలగించి వెడల్పు చేసే ప్రక్రియ. ఇందులో ఒక సన్నటి గొట్టం (దీనిని కేథటర్ ) మొదలు భాగానికి ఒక బెలూన్ను అమర్చి రక్తనాళంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత అడ్డంకి కారణంగా సన్నబడిన భాగంలో ఆ బెలూన్ ఉబ్బేలా చేస్తారు. తద్వారా రక్తనాళం లోపలి గోడలకు అతుక్కున్న కొవ్వుపై ఒత్తిడి కలిగించి, అది అణగి పోయేలా చేసి, సన్నబడిన రక్తనాళాన్ని వెడల్పు చేస్తారు. ఫలితంగా రక్త సరఫరా మెరుగవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా బెలూన్ను బైటికి తీస్తారు.
- కొన్నిసార్లు ఇలా కొవ్వుతో అడ్డంకి ఏర్పడిన భాగంలో ఒక సన్నటి లోహపు గొట్టాన్ని (స్టెంట్)ను అమరుస్తారు. ఈ గొట్టం ద్వారా రక్తం సాఫీగా సరఫరా అవుతుంది.
- రక్తనాళంలో ఏర్పడిన ఆటంకం కారణంగా రక్తనాళంలో అధిక భాగం సన్నబడి ఉంటే శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
- శరీరంలోని ఇతర భాగాల నుంచి మరొక రక్తనాళాన్ని తీసి అడ్డంకి ఏర్పడిన రక్తనాళంలో అడ్డంకి ఏర్పడిన చోట పైన, కింద అమరుస్తూ చికిత్స చేస్తారు.
Authorization