గర్భస్రావ మందులు సాధారణంగా మెడికల్ షాపుల్లో దొరుకుతాయి. ప్రిస్క్రిప్షన్ ఉన్నా లేకున్నా వీటిని అమ్ముతుంటారు. డాక్టరును సంప్రదించకుండా ఇలాంటి మందులు వేసుకుంటే కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీయొచ్చు. ఈ మాత్రల వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అధిక రక్తస్రావం, తలనొప్పి, వికారం, డయేరియా, కడుపు తిమ్మిరి, వాంతులు లాంటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ మాత్రలు వేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. - ఈ గర్భస్త్రావం తేలికగా, సునాయాసంగా జరిగేలా చేస్తాయి. అంతేకాదు... కొన్ని సార్లు ఈ గర్భ స్రావం వికటించే అవకాశాలూ ఉన్నాయి. - ఈ మాత్రలు చాలా తేలిగా మార్కేట్లో అందుబాటులో దొరికినా డాక్టరును సంప్రదించ నిదే వాడటం మంచిది కాదు. - మీకు ఏ మాత్రలు ఇస్తే పనిచేస్తాయో డాక్టరుకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి డాక్టరును సంప్రదించడం తప్పనిసరి. - ఆస్తమా, డయాబెటిస్, అనేమియా తదితర వ్యాధులు ఉన్న వారు ఈ మాత్రలు వాడరాదు. - హెచ్ఐవీ ఉన్నవారు అస్సలు వాడరాదు. - చాలావరకు గర్భ స్రావ మాత్రల వల్ల ఇబ్బంది లేదు. అయితే.. ఈ మాత్రల వాడకం వల్ల కొన్నిసార్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీటిపై ఆడవారికి ముందుగానే అవగాహన ఉండటం అవసరం. - ఒక్కోసారి ఈ ప్రక్రియ వికటిస్తే మీ గర్భస్రావం సగంలోనే ఆగివచ్చు. కడుపులోనే మిగిలిపోయి ఇన్ఫెక్షన్స్కు దారి తీయొచ్చు. - గర్భస్రావం సమయంలో కొన్నిసార్లు తీవ్ర నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది తగ్గేందుకు డాక్టరును సంప్రదించడం తప్పనిసరి. - కొన్నిసార్లు ఫాలోపియన్ ట్యూబ్ ప్రమాదానికి గురువుతుంది. దీనివల్ల రాబోయే కాలంలో పుట్టబోయే బిడ్డపై ఈ ప్రభావం ఉంటుంది. - కాబట్టి గర్భస్రావం చేయించుకోవాలంటే డాక్టరును సంప్రదించడం కన్నా ఉత్తమ మార్గం మరేదీ లేదు.