సమతులాహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావనేది అందరికీ అవగాహన ఉన్న విషయమే. బరువు పెరగడానికి, స్థూలకాయం రావడానికి కూడా ఇదే కారణమని ఇప్పటికే అనేక అధ్యయానలు తేల్చిచెప్పాయి. బరువు తగ్గడానికి సరైన ఆహారాన్ని ఎంచుకోవడం, నియమిత వ్యాయామం చేయడం, ఎక్కువగా నీళ్లు తాగడం దోహదపడతాయని వెల్లడిస్తున్నాయి. ఇవే కాదు.. బరువు తగ్గించుకోవడానికి ఆహార నియమాలు చాలానే ఉన్నాయి. వాటిలో తక్కువ కాలరీల చిరుతిళ్లు తీసుకోవడం ఒకటి. ఆహార ప్రణాళికను కఠినతరం చేసుకోకుండా బరువు
తగ్గడానికి ఇదే సరైన మార్గమని సూచిస్తున్నారు వైద్య శాస్త్ర పరిశోధకులు. స్థూలకాయం నుంచి
రక్షణ పొందేందుకు తేలికైన ఆహారం (లైట్‌ఫుడ్) ఎంతో మేలని అంటున్నారు.
క్యాలరీలు తక్కువ
ఫాస్ట్ ఫుడ్లను ఇష్టపడే వారిని బరువు పెరగకుండా కాపాడే మరో చిరుతిండి కరకరలాడే బ్రెడ్. ఇది ప్రధానంగా తృణధాన్యాలతో తయారవుతుంది. అనేక రుచులు, రకాల్లో దొరుకుతుంది. మీరు బరువు తగ్గే ఆహార ప్రణాళిక పాటిస్తుంటే ఇది మంచి పోషకాలిచ్చే చిరుతిండి. కరకరలాడే బ్రెడ్ ఒక ముక్క 32 కాలరీలను ఇస్తుంది, 0.2 గ్రాముల కొవ్వును కలిగి ఉంటుంది. శరీరానికి మేలు చేసి బరువు తగ్గడంలో ఉపకరించే ఈ చిరుతిండిలో ధాన్యం, పీచు పదార్థం ఉంటుంది.
ఆరోగ్య రక్ష
విటమిన్లు, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్క లంగా ఉండే ఆలివ్లలో ఒస్టియోపో రాసిస్, కాన్సర్, కీళ్ల నొప్పులు లాంటి వ్యాధులతో పోరాడే సామర్థ్యం ఉంటుంది. ఆలివ్లను నిమ్మరసంలో ముంచి, మూలికలు, సుగంధ ద్రవ్యాలతో వేయించి లేదా సహజ రూపంలోనో తినొచ్చు. ఒక ఔన్సు పచ్చ ఆలివ్లలో 41 కాలరీల శక్తి, 5 గ్రాముల కన్నా తక్కువ కొవ్వు ఉండగా, ఒక ఔన్సు నల్లటి ఆలివ్లలో 47కాలరీలు, 3.8 గ్రాముల కొవ్వు ఉంటాయి.
సాటిలేనివి..
క్యారెట్లు, తోటకూర, దోసకాయ లాంటి కూరగాయలు వాడడం అధిక బరువు తగ్గించుకోవడానికి సులభమైన మార్గం. హమ్మస్ లాంటి డిప్లతో మీరు ఇలాంటి కూరగాయలు తినొచ్చు. అవోకాడో, ఆరిచోక్ డిప్లు కూడా మీ ఆహార పట్టికలో చేర్చుకోదగ్గ చిరుతిళ్లు. వీటిలో కాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి.
బెస్ట్ ఫుడ్
బరువు తగ్గాలనుకున్నప్పుడు మీరు నిల్వ ఉంచుకోదగ్గ చిరుతిండి పాప్‌కార్న్. అయితే.. సినిమా హాళ్లు, సూపర్ మార్కెట్లలో దొరికే దానిలా ఇందులో వెన్న, చక్కర, ఉప్పు లాంటివి లేకుండా చూసుకోవాలి. పాప్ కార్న్ తేలిగ్గా ఉండే పదార్థం. ఇందులో పీచు ఎక్కువ ఉంటుంది. ఒక కప్పు పాప్ కార్న్‌లో 31 కాలరీలు మాత్రమే ఉంటాయి. అర గ్రాము మాత్రమే కొవ్వు పదార్థం ఉంటుంది. గాలి ద్వారా తయారు చేసే పాప్ కార్న్‌లో కొవ్వు ఉండదు. ఇవి బరువు తగ్గడానికి ఎంతో దోహదం చేస్తాయి. వెన్న, తీపి, ఉప్పటి పాప్ కార్న్ లకు మాత్రం దూరంగా ఉండాలి.
కొన్ని తీసుకున్నా..
గుప్పెడు ద్రాక్షలు, కాసిన్ని స్ట్రా బెర్రీలు ఆకలి తీర్చడంలో బాగా ఉపయోగ పడతాయి. ఇవే కావు.. పుచ్చకాయ, యాపిల్, బెర్రీలు, బత్తాయి, అత్తి పండ్లులాంటివి కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
పోషక విలువలు పుష్కలం
కొవ్వు లేని లేదా తక్కువ కొవ్వుండే పెరుగు తినడం కూడా ఆకలిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన మార్గమే. పెరుగులో ఇతర పోషక విలువలు కూడా ఉంటాయి. ఇందులో పుష్కలంగా కాల్షియం, మాంసకృత్తులు, పొటాషియం ఉంటాయి. ఇవి మంచి సూక్ష్మ క్రిములను ఉత్పత్తి చేసి జీర్ణ సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటాయి. బెర్రీలు, గ్రనోలా లాంటి వాటితో కూడా మీగడ వాడొచ్చు.
కప్పు తీసుకున్నా చాలు
ఒక కప్పు ఓట్ మీల్ ని పాలల్లో కానీ మరే రూపంలో కానీ తీసుకొన్నా ఫలితాలుంటాయి. ఓట్ మీల్ లోని పీచు... ఇతర కార్బొహైడ్రేట్ల వల్ల శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది. దీనిలోని పొటాషియం, పాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు మీరు ఉత్సాహాంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. కొత్త ఆలోచనలు వచ్చేలా ఉత్తేజపరుస్తుంది. అధిక కొవ్వు సమస్య కూడా ఉండదు. అన్నిటికంటే గొప్ప ప్రయోజనం అంటే దానిని క్షణాలలో తయారు చేయొచ్చు. పనిలోకి తొందరగా వెళ్లేవారు మైక్రోవేవ్‌లో ఓట్ మీల్ తయారు చేసి రెడీగా తినేయొచ్చు.
Authorization