తీపి పానీయాలు, కార్బొనేటెడ్ సోడాలు తీసుకునే నడి వయసు మహిళలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువట. అమెరికన్ అసోసియేషనప్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. తీపి పానీయాలు తీసుకునే నడి వయసు మహిళల్లో క్యాన్సర్ ముప్పు 70 శాతం ఎక్కువ అని తేలింది. టైప్-1 ఎండోమెట్రియల్ కేన్సర్తోపాటు స్థూలకాయం సమస్య తలెత్తుతాయని పరిశోధకులు గుర్తించారు. పీరియడ్స్ ఆగిపోయే దశలో ఉన్న సుమారు 23 వేల మంది మహిళలను పరిశీలించగా ఈ మేరకు ఫలితాలు వచ్చాయని వెల్లడించారు.