- రోజుకు 20 నిమిషాలపాటైనా బ్రిస్క్ వాక్ లేదా రన్నింగ్ చేయాలి. దీంతో ఒత్తిడి అస్సలు దరిచేరదు. - పని మనుషుల మీద ఎక్కువగా ఆధారరపడకుండా ఇంటి పని స్వయంగా చేసుకుంటే శారీరక వ్యాయామంతో పాటు క్యాలరీలు కూడా అధికంగా ఖర్చవుతాయి. - ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర కూడా ఎంతో అవసరం. నిద్రలేమి అనేది జబ్బులకు నిలయంలాంటిది. అలాగని అతి నిద్ర కూడా మంచిది కాదు. శరీరానికి ఎంత అవసరమో అంతే నిద్రపోవాలి. రాత్రివేళ త్వరగా పడుకుని వేకువజామునే నిద్రలేవడం మంచిది. - ఆహారంలో తరచూ పాలకూర తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఐరన్ పుష్కలంగా లభించడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. - కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి చాలామంది రకరకాల పద్ధతుల పాటిస్తుంటారు. అలాంటి వారు క్రమం తప్పకుండా ఓ చిన్న గిన్నెడు ఓట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. - నీరు తాగడం అన్నది ఆరోగ్యానికే కాదు.. అందానికీ కూడా అవసరమే. వ్యాయామం చేయడానికి ముందు, ఆ తర్వాతా తప్పనిసరిగా నీరు తాగాలి. - లోబీపీ, ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు నిపుణుల సలహా మేరకు క్రమం తప్పకుండా రోజూ కొద్ది సేపైనా వ్యాయామం చేయడం మంచిది. - వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయాసం, శ్వాసపరమైన సమస్యలు ఎదురుకావచ్చు. అలాంటప్పుడు వ్యాయామం చేయడం వెంటనే ఆపేయాలి. దగ్గరలో ఉన్న డాక్టరును సంప్రదిం చాలి. ఉదయం వ్యాయామానికి సమయం కేటాయించాలి. నచ్చిన వ్యాయామం ఏదైనా చేయొచ్చు. ఉరుకుల పరుగుల జీవితంలో పడిపోయి వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిదికాదు. - సిగరెట్లు, పొగాకు, మద్యపానం లాంటి దురలవాట్లు ఉంటే తప్పకుండా మానుకోవాలి. వ్యసనాల బారినపడితే ఆరోగ్యం చెడిపోవడం ఖాయం. - మనం తినే భోజనమే మనకు అమృతం. అదే మన జీవితానికి శక్తిప్రదాయిని. నిర్ణీతవేళలో పుష్టికర భోజనం తీసుకోవాలి. అది శరీరానికి కావాల్సిన పోషకాలు అందించేదిగా ఉండాలి. అమితమైన భోజనం లేదా అతి తక్కువ భోజనం శరీరానికి అంత మంచిదికాదు. ఆహారం బాగా నమిలి, ఎక్కువ సేపు తినడం వల్ల జీర్ణం కావడంతోపాటు మరో ప్రయోజనం కూడా ఉంది. ఎక్కువ సేపు ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువగా తిన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. దాంతో ఎక్కువ సమయంలో తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు.