ఎండాకాలం వచ్చిందంటే చాలు చెమటతో ఇబ్బంది పడేవారి సంఖ్య కన్నా.. ఇతరుల నుంచి వచ్చే చెమట దుర్వాసనను భరించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జనసంచారం ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతాల్లో ఇది పెద్ద సమస్య. చాలామంది తమ శరీరం నుంచి వచ్చే చెమట దుర్వాసనను ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీకే కాదు ఇతరులకు ఇబ్బంది కలిగించే చెమట వాసన నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇటీవల జరిగిన వివిధ అధ్యయనాల తర్వాత చెమట గురించిన కొన్ని వాస్తవాలు తెలిశాయి. వాతావరణంలోని వేడి చెమటకు కారణం అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. చెమట పట్టడానికి ముఖ్య కారణం అలసట, అశాంతి, చికాకు. ఎండా కాలంలో వాతావరణం చికాకు తెప్పించేలా ఉంటుంది. ఉష్టోగ్రత పెరగడంతో స్వేధ గ్రంధుల నుంచి చెమట ఉత్పత్తి అవుతుంది. శరీర దుర్వాసనకు ఈ స్వేధ గ్రంధులే ముఖ్య కారణం. - ప్రతి రోజు పొద్దున, రాత్రి స్నానం చేయడం వల్ల అలసట నుంచి బయటపడవచ్చు. - స్నానం చేసే నీటిలో సువాసభరితమైన రోజ్‌వాటర్‌ను, అర స్పూన్ నిమ్మరసం జతచేస్తే.. మరింత రిలాక్స్ ఉంటుంది. - శుభ్రంగా ఉతికిన బట్టలను ధరించడం వలన శరీరం నుండి దుర్వాసన రాదు. - వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. - వీటితో పాటు మీరు తీసుకునే ఆహారంలోనూ కొన్ని మార్పులు చేయండి. - చెమటను త్వరగా పీల్చుకునే కాటన్ వస్త్రాలను ధరించండి. - టెన్షన్ వల్ల చెమట ఎక్కువ వస్తుంది. ప్రశాంతత చాలా ముఖ్యం. పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలి.