మనలో చాలామంది వయసు పై బడే కొద్ది వచ్చే కీళ్ళ అరుగుదల వలన నడక నరకప్రాయమై, చిన్నచిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడుతుంటారు. ఇటువంటివారికి కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స పునర్జన్మ అని చెప్పవచ్చు.
మోకీలు మార్పిడి శస్త్ర చికిత్స ఎవరికి అవసరం?
నడక ఇబ్బంది అవుతున్న ప్రతివారికి మోకీలు మార్పిడి అవసరం లేదు. అయితే వారి లక్షణాలను, ఇబ్బందులను క్షుణ్ణంగా గమనించాలి. ఈ క్రింది లక్షణాలు కనిపించిన వారికీ మోకీలు మార్పిడి అవసరం అవుతుంది.
- కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా మోకీలు నొప్పి తగ్గక బాధపడు తుండటం
- పది నిమిషాల కంటే ఎక్కువ సమయం నిలబడలేకపోవడం
- 500గజాల కంటే ఎక్కువ దూరం నడవలేకపోవడం
- ఎక్స్‌రేలో మోకీలు అరుగుదల చాలా ఎక్కువగా కనిపించడం
ఫాస్ట్ ట్రాక్ అనస్థీషియా..
ఇది వరకు ఇచ్చే అనస్థీషియా పద్ధతిలో ఆపరేషన్ తరువాత నొప్పులు ఎక్కువగా ఉండ టం వలన పేషెంట్స్ రెండు రోజుల తర్వాత గాని నడక మొదలు పెట్టేవాళ్ళు కాదు. కాని ఈ నూతన పద్ధతిలో అనస్థీషియా ఇచ్చి సర్జరి చేసిన రోజు సాయంత్రం నుంచే నడక ఆరంభించడం, రెండు రోజుల్లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇలా మొదటిరోజు నుండే నడవడం వలన వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి చాలా తొందరగా కోలుకోవడం గమనించదగ్గ విషయం. అంతేకాక వారు కొద్దికాలంలోనే వారి నిత్యావసర పనులు చేసుకోవడమే కాక, మెట్లు ఎక్కడం, వాహనాలు నడపటం ఆనందకరమైన విషయం.
ఈ పద్ధతి ద్వారా, ఆపరేషన్ తర్వాత నొప్పి తక్కువగా ఉండటం వలన ఇంతకు ముందులా నొప్పి తగ్గడానికి వాడే మాత్రలు (పెయిన్ కిల్లర్స్) కూడా చాలావరకు తగ్గుతాయి. తద్వారా వాటివల్ల సైడ్ ఎఫెస్ట్స్ వచ్చే అవకాశం కూడా తగ్గినట్టే. అంతేకాకుఞడా పేషెంట్ ఆపరేషన్ చేసిన రోజు నుండే నడవడం ద్వారా రక్తనాళాలలో రక్తం గడ్డకట్టే సమస్య (ణVు ) వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
ఇంప్లాంట్లో వచ్చిన ఆధునికతలు..
శస్త్రచికిత్సలో వాడే ఇంప్లాంట్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో వచ్చాయి. ఇంతకు ముందువాడే ఇంప్లాంట్స్ వల్ల మెటల్ ఎలర్జిలు వచ్చే అవకాశం ఉండేది. అంతే కాకుండా వాటి మన్నిక కూడా తక్కువే. కాని ఇప్పుడు వచ్చే ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ 30ఏండ్ల వరకు మన్నగలవని ల్యాబ్‌లో ధృవీకరించబడినది.
వెరిలాస్ట్ ఆక్సీనియం...
మోకీలు , తుంటి మార్పిడిలో వాడే ఆక్సీనియం(ఆక్సీడైజ్డ్ జిర్కోనియం) ను శూూజు తో జతచేసి వాడేదే ఈ వేరిలాస్ట్ ఆక్సీనియం.
- ఇది అమెరికా ఎఫ్డిఏలో 30ఏండ్లు మన్నుతుందని ధృవీకరించ బడినది.
- ఇది బరువులో గతంలోని ఇంప్లాంట్స్ కంటే 20శాతం తక్కువగా ఉంటుంది. సన్నగా ఉండటం వలన మన్నిక రెండింతలు ఎక్కువ.
- ఇదివరకు ఉన్న ఇంప్లాంట్స్ కంటే మరింత ధృడమైనది.
మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు ఆక్సీనియంతో చేసిన వారిలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కాని, ఇన్ఫెక్షన్లు కాని రావడం చాలా చాలా అరుదు.
తప్పనిసరి అయితేనే శస్త్రచికిత్స చేయడం లేదా పేషెంట్‌కి మందులతోనే నయం చేయడం జరుగుతుంది. అంతేకాదు శ్రీకర హాస్పిటల్స్‌లో ఇహెచ్ఎస్ సదుపాయం ఉంది.
- డాక్టర్ కార్తీక్ తెలగారెడ్డి
మోకీలు,తుంటి
శస్త్రచికిత్స ప్రముఖ నిపుణులు
శ్రీకర హాస్పిటల్స్, సికింద్రాబాద్.
ఫోన్. 8985 896 229
Authorization