ప్రపంచ ఆరోగ్య సంస్థ (షశీతీశ్రీస ష్ట్రవaశ్ర్‌ీష్ట్ర ఉతీస్త్రaఅఱఓa్‌ఱశీఅ) చేస్తున్న సిఫారస్సు ప్రకారం వారానికి ఒకటి, రెండు చేపలు తినాలి. అప్పుడే శరీరానికి కావల్సిన ఒమేగా ఫాటీ ఆసిడ్స్ లభిస్తాయి. మరి చేపలు తినడానికి ఇష్టపడని వారు కనీసం చేపనూనెనైనా ఉపయోగిం చాలి. ఎందుకుంటే చేప నూనెలో 30 శాతం ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉండగా, మిగిలిన 70 శాతం ఖనిజాలతో,పోషకాలతో నిండి ఉంటుంది. చేప నూనె అనేది ఎక్కువ జిడ్డు కలిగిన చేపల కణజాలం నుండి సేకరిస్తారు. ముఖ్యంగా సాల్మన్, వైట్ ఫిష్, హెర్రింగ్, సర్డినెస్, అన్కోవిస్ అనే చేపల నుండి ఈ చేప నూనెని తీస్తారు. చేప నూనెలో అధికంగా ఉండే ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. చేప నూనె అనేక సమర్ధవంతమైన ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది బరువుని తగ్గించుటయే కాకుండా కాన్సర్ వంటి జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.
గుండె ఆరోగ్యానికి..
గుండెపోటు ప్రపంచంలోని మరణాల ప్రధాన కారణాల్లో ఒకటి. చేప నూనెని తీసుకునే ప్రజలు ఎక్కువగా హ ద్రోగం బారిన పడకుండా ఉన్నారని ఎన్నో నివేదికలు తేల్చాయి. ఈ చేప నూనె శరీరంలో కొవ్వు స్థాయిలను ట్రైగ్లిసరైడ్స్ ను తగ్గించడం మూలంగా అధిక రక్తపోటుని, గుండెపోటును నివారిస్తుంది.
దృష్టి లోపం రాకుండా
కొన్ని పరిశోధనల ప్రకారం ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు తగినంత తీసుకోని వ్యక్తులలో కంటి వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటున్నా యని తేలింది. అంతేకాక వీరిలో కంటి చూపు సమస్య వృద్ధాప్యంలో ఎక్కువగా ఉంటుంది. ఇది కంటికి సంబంధించిన వ్యాధులకు దారి తీస్తుంది. చేపలు తినేవారిలో చేపనూనె తీసుకోనేవారిలో కంటి చూపు సమస్యలు చాలావరకు తగ్గుతాయి.
వ్యాధినిరోధక శక్తి..
చేప నూనె తీసుకోవడం ద్వారా వ్యాధి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సర్వసాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి కొన్ని వ్యాధులను సైతం ఎదుర్కొనగలదు. చేప నూనె వినియోగం వలన జ్వరం, చర్మ వ్యాధులు, అలసట తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (Aణనణ) వంటి చికిత్సను తగ్గించుటలో ఈ చేప నూనె సహాయపడుతుంది. దీనికి కారణం ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్. ఇది అధిక రక్తపోటు, డైస్లెక్సియా, ఏకాగ్రత కోల్పోవుట, భావోద్వేగ అస్థిరతతో బాధ పడుతున్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది .
తామర, చర్మం కమిలిపోయినట్లు మారడం, గాయాలు, దురద, దద్దుర్లు వంటి వివిధ రకాల చర్మ సమస్యల పరిష్కారానికి చేప నూనె ఉపయోగపడుతుంది. చేప నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శారీరిక పెరుగుదల, మానసిక అభివృద్ధికి చాలా తోడ్పాటుని ఇస్తాయి. గర్భధారణ సమయంలో తల్లులు తీసుకోవడం ద్వారా తమ శిశువులకి చక్కటి శరీరాక తిని, కంటి చూపుని ఇవ్వగలరని డాక్టర్లు చెప్తారు. అందుకే గర్భణీలకు ఏ,డి విటమిన్ మాత్రలను ఇస్తారు.
కాన్సర్ కణాలను నాశనం చేయడంలో..
ప్రపంచాన్ని భయపెడుతున్న అనేక రకాల క్యాన్సర్లను నివారించడంలో చేపనూనె ఎంతో ఉపయోగపడుతుంది. చేపనూనె లోని పోషకాలు రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ వంటి వివిధ రకాలైన క్యాన్సర్లను నివారించడంతో పాటు శరీరంలోని కాన్సర్ కణాలను పూర్తిగా నాశనం చేయడంలో సహాయపడుతుంది. చేప నూనెలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. క్యాన్సర్ రాకుండా నియంత్రించడం తో పాటు.. క్యాన్సర్ చికిత్సలోనూ మెరుగైన ఫలితాలను ఇస్తుంది.
అధిక బరువును నియంత్రించేలా..
ఊబకాయం ఇతర వ్యాధుల తీవ్రతని పెంచే ఒక ప్రమాదకరమైన వ్యాధి. గుండె జబ్బు, టైప్ 2 మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధు లకి ప్రధాన కారణం ఈ ఊబకాయంమే. చేప నూనె ఈ ఊబకాయం స్థాయిని పెరగకుండా నివారిస్తుంది. ఉబకాయానికి గురవుతు న్నారు అని అనుమానం వస్తే చేపనూనెని తీసుకోవడం మంచిది.
మానసిక సమస్యల నివారణకు..
సాధారణంగా మెదడు పనితీరుకు కూడా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం. కొన్ని మానసిక రుగ్మతలతో ఉన్న ప్రజలు తక్కువ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను తీసుకుంటున్నారని పరిశోధనల ద్వారా స్పష్టమైంది. చేప నూనె తీసుకోవడం ద్వారా , స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్స్ వంటి మానసిక వ్యాధులని నివారించవచ్చు అని అనేక అధ్యయనాలు రుజువు చేశాయి.
నొప్పులను నివారించుటలో
చేప నూనెలో సహజ సిద్దంగా ఉండే నొప్పి నివారణా లక్షణాలు, రుమ టాయిడ్ ఆర్థరైటిస్ కలిగించే కొన్ని వ్యాధులను సైతం చికిత్స చేయ గలదు. అంతేకాదు బుద్దిమాంద్యం, మధుమేహం, ఊబకాయం , గుండె జబ్బులు వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వలన కలిగే తీవ్రమైన నొప్పులను నివారిస్తుంది.
Authorization