మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో నిద్ర అంతకన్నా ఎక్కువ అవసరం. మంచి ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరూ అంటే నిద్రపోయేవాళ్లే అని చెప్పవచ్చు. తిండి లేకుండా అయినా బతకవచ్చు కానీ నిద్రలేకుండా బతకుబండిని లాగడం చాలాచాలా కష్టం. పొద్దున లేచింది మొదలు అనేక ఒత్తిళ్ళతో జీవనం గడిపేవారిలో ఎంతో మందికి నిద్రలేమి ప్రధాన సమస్యగా మారింది. దీనితో శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలెన్నో వారిని చుట్టుముడుతున్నాయి. నిద్రలేమి చాలా ఆరోగ్య సమస్యలకు హేతువని వైద్య నిపుణులు హెచ్చరిస్తునే ఉన్నారు. ఈ రోజు 'వరల్డ్ స్లీప్ డే' సందర్భంగా నిద్రకు సంబంధించిన కొన్ని నిజాలు..
ఆరోగ్యానికి, నిద్రకు ప్రత్యక్ష సంబంధం ఉంది. తగినంత నిద్ర లేకపోతే దాని ప్రభావం శరీర ఆరోగ్యంపై పడుతుంది. నిద్ర లేమితో కండ్ల్లు అలసటగా కనిపిస్తాయి. అందవిహీనంగా కనిపిస్తాయి. నిద్రలో అనేక శరీర కణాలు తిరిగి ఉత్తేజితం అవుతాయి. కొత్తకణాలు తయారవుతాయి. అంతేకాదు నిద్రించే సమయంలో మెదడు విశ్రాంతి పొందడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. ఏదైన ఒక మంచి పని చేయాలనుకొన్నా, నేర్చుకోవాలను కొన్నా మంచిగా నిద్రపోయి లేవడం వల్ల కొత్త ఐడియాలతో చురుకుగా పనిచేయగలు గుతారు. ఎక్కువ కాలం జీవించగలుగుతారు. అతి నిద్ర, నిద్రలేమి రెండు ప్రమాదమే. ఆరోగ్యకరమైన సగటు మనిషికి రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంట నిద్ర చాలా అవసరం.
గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కీళ్ళనొప్పులు, ప్రీమెచ్యూర్ ఏజింగ్ వంటి సమస్యలన్నీ నిద్రలేమి వల్ల కలుగుతాయని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
చాలామందికి నిద్ర వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుందని తెలుసు. అయితే కొన్ని పరిశోధనల్లో రోజు ఎనిమిది గంటల నిద్రపోయే వారిలో సృజనాత్మకత కూడా ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. తగినంత సమయం నిద్రపోవడంతో మెదడు చురుగ్గా మారి వారిలో స జనాత్మకతను పెంచుతుంది. కొత్త కొత్త ఐడియాలు వస్తాయి.
అథ్లెట్స్ బాగా రాణించాలంటే ఒక అధ్బుతమైన మార్గం నిద్ర అని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనంలో స్పష్టమైంది. ఏడు నుంచి పది వారాల పాటు ప్రతి రోజూ రాత్రి కనీసం 10గంటలు నిద్రపోవడం వల్ల ఫుట్ బాల్ క్రీడాకారుల్లో యావరేజ్ స్పిరిట్ అభివద్ధి చెంది పగలు అతి తక్కువ అలసట పొందుతారని, ఆటల్లో రాణిస్తారని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మీరు బరువు తగ్గడానికి డైట్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఆహారంతో పాటు స్లిపింగ్ టైమ్ కోసం కూడా ప్లానింగ్ చేసుకోవాలి. ఎందుకంటే నిద్ర సమయంలో శరీరంలోని జీవక్రియలన్నీ నియంత్రించబడుతాయి. కొన్ని హార్మోన్లు రక్తంలో కలిసి, ఆకలిని పెంచుతాయి. సరైన నిద్రలేనప్పుడు ఆకలి పెరగడం వల్ల బరువు తగ్గే ఛాన్సే ఉండదు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కంటి నిండా నిద్ర చాలా అవసరం.
సరైనంత నిద్ర పొవడం వల్ల ఒత్తిడిని కచ్చితంగా తగ్గించుకోవచ్చు. దాంతో బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. మంచి నిద్ర వల్ల ఆందోళన తగ్గుతుంది. భావోద్వేగాలను తగ్గించుకొంటారు. బాగా ఆందోళనగా అనిపించినప్పుడు, అలసిపోయినప్పుడు కంటినిండా నిద్రపోతే కలిగే రిలీఫ్‌కు ఏ మందుకు సరితూగవు.
నిద్రలేమి సమస్య ఎదుర్కొనేవారిలో టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఇందుకు కారణం..రక్తంలోని ఇన్సులిన్ స్ధాయి తగ్గి హార్మోన్లపై ప్రభావం పడుతుంది. సరైన నిద్ర పోవడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చు. అంతేకాదు సరైన నిద్రలేకపోవడం వల్ల హ దయ వ్యవస్థ మందగిస్తుంది. రక్తనాళాల్లో రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడంతో గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. అలా అని ఎక్కువ సేపు నిద్ర పోవడం మంచిది కాదు. నిద్ర వల్ల విశ్రాంతిని పొందడమే కాదు మన శరీరంలోని అతి ముఖ్య పనులకు నిద్ర అవసరం అన్నది గుర్తుంచుకోవాలి.
ఎండాకాలంలో
ఎండాకాలంలో ఇంట్లో వేడితో పాటు శరీరంలోనూ అధిక ఉష్ణోగ్రత ఉండటం వల్ల నిద్రపట్టడం చాలా కష్టం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎండాకాలంలో హాయిగా సేదతీరవచ్చు.
శ శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు పగటివేళ వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాల్ని తీసుకోవాలి. పండ్లరసాలు, మజ్జిగ లాంటివి తాగాలి. రాత్రి వేళ మెలకువ వచ్చినపుడు చల్లని నీటిని తాగితే నిద్ర పట్టేస్తుంది.
శ అందరికీ ఏసీలు అమర్చుకునేంత ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. తక్కువ ఖర్చుతో ఏసీని ఏర్పాటుచేసుకోవచ్చు. ఇందుకోసం టేబుల్ ఫ్యాన్ ఉంటే సరిపోతుంది. దీనికి ఎదురుగా ఒక బౌల్లో కూల్ వాటర్, ఐస్ ముక్కల్ని ఉంచితే గది అంతా చల్లబడు తుంది. హాయిగా నిద్రపోవడం సాధ్యమవుతుంది.
శ నైట్డ్రస్సుల విషయానికొస్తే శరీరానికి హాయినిచ్చే కాటన్ దుస్తులు ధరించాలి. టీ షర్టులు, పాంట్స్, షార్ట్స్.. ఇలా కాస్త వదులుగా ఉంటే కాటన్ డ్రెస్సులైతే బావుంటుంది. శరీరానికి ఉపశమనం లభిస్తుంది. చక్కని నిద్ర పడుతుంది.
శ బెడ్షీట్లు, దుప్పట్లు కాటన్‌వి ఉండేలా చూసుకోవాలి. లైట్ కలర్ లో ఉంటే మరీ మంచిది.కంటికి రిలీఫ్ ఇస్తే త్వరగా నిద్రపడుతుంది.
శ పొద్దున త్వరగా నిద్ర లేచి తేలికపాటి ఎక్సర్సైజ్లు చేయాలి. దీని వల్ల శరీరం ఫిట్‌గా మారుతుంది. అంతేకాదు శరీరం అలసిపోతుంది. దీని వల్ల రాత్రివేళ త్వరగా నిద్రపడుతుంది.
-అమోగ్న్
ప్రపంచవ్యాప్తంగా 60ఏండ్లకు పైబడిన వారిలో దాదాపు 40-60శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతు న్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్ సొసైటీస్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఎలాంటి కారణం లేకుండానే నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య ఆరు శాతం ఉంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారు. అంతేకాదు డిప్రెషన్‌తో బాధపడేవారిలో 90 శాతం మందిలో నిద్రలేమి సమస్య ఉంది. మనదేశంలో నిద్రలేమి సమస్యతో బాధపడేవారిలో 6.5 శాతం మంది మహిళలు, 4.3 శాతం మంది పురుషులు ఉన్నారు.
చిన్నారుల్లో సగటు నిద్రవేళలు
వయసు రోజుకు
మొదటి నెలలో 16-20 గంటలు
రెండవ నెలలో 14-16 గంటలు
3-11నెలల మధ్య 12-15 గంటలు
1-3 ఏండ్ల మధ్య 11-14 గంటలు
3-5 ఏండ్ల మధ్య 10-13గంటలు
వివిధ వయసుల్లో నిద్రించే సమయం
6 - 13 9-11గంటలు
14-17 8-10గంటలు
18-25 7-9గంటలు
26-64 6-8గంటలు
65- 6-7గంటలు
Authorization