శరీర అంతర్భాగంలో రక్తం చాలా ముఖ్యమైన అంశం. రక్తంలో రక్తఫలకికలు (ప్లేట్లెట్) చాలా కీలకమైన ములకాలుగా చెప్పవచ్చు. మీ శరీర రక్తంలో వీటి సంఖ్య తక్కువగా ఉందా! అయితే ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలను తినటం వలన వీటి సంఖ్య మెరుగుపడుతుంది. - రక్తఫలకికలు అనేవి రక్తంలో ఉండే కణాలు, ప్రమాదాలకు గురైనపుడు, రక్తాన్ని గడ్డకట్టేలా చేసి, రక్తం కోల్పోవటాన్ని ఆపి, శరీరానికి రక్షణ కల్పిస్తాయి. రక్తనాళాలు ప్రమాదానికి గురయ్యాయని రక్త ఫలకికు సమాచారం అందిన వెంటనే, రక్తనాళాన్ని మరమ్మత్తుకు గురిచేసి, ప్రమాదాల నుండి కాపాడతాయి. రక్తఫలకికలు ఉండాల్సిన స్థాయిల కన్నా తక్కువ సంఖ్యలో ఉంటే, అనగా ఒక మైక్రోలీటర్ రక్తంలో 150,000 నుండి 45,000 కన్నా తక్కువగా ఉంటే ఈ పరిస్థితిని ''థ్రోంబోస్కెటోపెనియా'' గా పేర్కొంటారు. సాధారణంగా, వివిధ రకాల మందుల వాడకం వలన, డెంగ్యూ జ్వరం వలన, ఆల్కహాల్ అధికంగా తీసుకోవటం మరియు వైరస్ లు శరీరంలో ప్రవేశించటం వలన రక్తఫలికికల సంఖ్య తగ్గుతుంది. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహర పదార్థాలను తినటం వలన వీటి సంఖ్యను మెరుగుపరుచుకోవచ్చు. - దానిమ్మలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే విటమిన్ 'సి', మినరల్ , యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి. దాన్నిమ్మ జ్యూస్ రోజూ తాగితే ప్లేట్లెట్స్ సంఖ్యను సహజసిద్ధంగా పెంచుకోవచ్చు. - కాల్షియం, పాస్పరస్, పొటాషియం వంటి ములకాలు ఎక్కువగా ఉండే పాలు రోజూ తాగడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను తగ్గించి, రక్త ఫలకికల సంఖ్యను పెంచే గుణం పాలలో ఉంది. - శరీరంలో ఫోలేట్ లోపం వలన రక్తంలో రక్తఫలకికల సంఖ్య తగ్గుతుంది. ఫోలేట్ అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థాలను తినటం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. విటమిన్ 'బి9' లేదా ఫోలేట్ కణ విభజనకు మరియు పెరుగుదలకు, డిఎన్ఏ సమన్వయానికి, మెదడు సరిగా పని చేయటానికి ఇది అవసరం. నారింజ, పాలకూర, త ణ ధాన్యాలలో ఫోలేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. - లీన్ ప్రోటీన్ ఆహార పదార్థాలలో థ్రోంబోస్కెటోపెనియా ను తగ్గించే జింక్, విటమిన్ 'బి12' వంటి ముఖ్య పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. రక్తఫలకికల సంఖ్య కలిగి ఉన్న వారు లీన్ ప్రోటీన్ ఉన్న ఆహారాలను తప్పక తినాలి. లీన్ ప్రోటీన్ ఎక్కువగా చికెన్, టర్కీ మరియు చేపలలో ఉంటాయి.