రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుభ్రపరచే బాధ్యతను అనుక్షణం నిర్వర్తించే కిడ్నీలు శరీరంలో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. నిరంతరం పనిచేస్తూనే ఉండే ఈ అవయవాలు మలినాలు తొలగించే ప్రక్రియలో కొన్ని మలినాలు రాళ్లుగా, ట్యూమర్స్గా మారి కిడ్ని పనితీరులో అంతరాయం కల్పిస్తాయి. అందకే తరుచుగా కిడ్నీలను డిటాక్స్ చేయాలి. సహజంగా పద్దతుల్లో కిడ్నీ లను డిటాక్స్ చేయడం తెలుసుకుంటే ఎన్నో అనారోగ్యసమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.
నీరు బాగా తాగాలి..
కిడ్నీలను సులభంగా శుభ్ర పరచగల శక్తి మంచినీటికే ఉంది. అందుకే నీళ్లు బాగా తాగాలి. రోజూ మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగడం కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మంచిది. నీళ్ళు టాక్సిన్ పదార్థాలను ఫిల్టర్ చేసినట్టుగా తొలగించేస్తుంది. మీరు తాగే నీళ్లు మీ శరీరానికి, కిడ్నీలను శుభ్రం చేయడానికి సరిపోతున్నాయా లేదా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు. మీరు సరిపడ నీళ్లు తాగుతుంటే.. మీ యూరిన్ క్లియర్గా, ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటుంది. యూరిన్ రంగు మారినా.. దుర్వాసనగా ఉన్నా ఎక్కువగా నీళ్ళు తాగాలి అని తెలుసుకోవాలి.
పొటాషియం ఎక్కువగా..
ఫ్రెష్ పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండండి. గ్రేప్స్,ఆరెంజేస్, బననా, కివి, అప్రికాట్ లాంటివి పొటాషియం కు మంచి సోర్స్. పాలు, పెరుగు లలో కూడా పుష్కంగానే ఉంటాయి. ముఖ్యంగా, వివిధ రకాల బెర్రీస్, ఎందుకంటే వీటిలో ఉండే క్వినైన్ మెటబాలిజం లో హిప్యురిక్ ఆసిడ్ గ మారి కిడ్నీ లను సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ..
మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బార్లీ దాన్యం కిడ్నీ లను శుబ్రపరచడమే కాదు, ప్రమాదాల బారి నుండి కాపాడగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇడి ఫైబర్ ఎక్కువగా ఉండే ఒక హౌల్ గ్రైన్. ఇది ఇంకా డయాబెటిస్ లాంటి వాటినుండి కూడా సమర్దవంతంగా రక్షిస్తుంది. కొన్న బార్లీ గింజలను రాత్రిళ్ళు నీళ్ళల్లో నానేసి, ఉదయాన్నే ఆ నీటిని తాగడంవల్ల బార్లీ లోని మంచి గుణాలను పూర్తిగా స్వీకరించవచ్చు.
మత్తు పదార్థలకు దూరంగా..
ఆల్కహాల్, చాకొలేట్ , కేఫిన్ వంటి పదార్థాలు కిడ్నీలకు చాలా కీడు చేస్తాయి. ఒక కిడ్నీ ల పైనే కాదు, ఓవర్ అల్ ఆరోగ్యం పై కూడా వీటి నెగటివ్ పలితాలు కనిపిస్తున్నాయి. వీటిని కరిగించే క్రమంలో కిడ్నీల పై చాల ప్రభావం పడుతుంది . దీనితో కిడ్నీ ల పనితీరు తగ్గిపోతుంది. అందుకే, వీటికి దూరంగా ఉండటం కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Authorization