మనం రోజూ తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. శరీరానికి కావల్సిన పోషకాలు అందకపోతే అనారోగ్యసమస్యలు దాడి చేస్తాయి. అందుకే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయల్లో పోషక విలువలు ఎక్కువ. సమతుల ఆహారానికి ఇవెంతో దోహదపడతాయి. ఇందులోని విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. వీటిలో రోగ నిరోధక శక్తి అధికం. నిత్యం తీసుకుంటే ఆరోగ్యం సురక్షితం.
గుమ్మడి
ఇందులో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్ధకం మొదలుకొని మధుమేహం వరకు అనేక రోగాలకు గుమ్మడి ఉపయోగపడుతుంది. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఉపయుక్త ఖనిజాలే కాకుండా విటమిన్-ఏ అధికంగానూ, విటమిన్-సీ స్వల్పంగానూ ఉంటుంది. గుమ్మడి గింజల్ని చక్కెరలో కలిపి తింటే కడుపులోని 'టేప్ వార్మ్స్' నశిస్తాయి.
కాకరకాయ: ఆరోగ్య పరిరక్షణలో ఈ కాయ కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహానికి ఇది చక్కని మందు. దీని రసంలో హూపోగ్లైసమిక్ పదార్థం ఉంటుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకర రసాన్ని కుక్క, నక్క కాటులకు విరుగుడుగా ఉపయోగిస్తారు. సోరియాసిస్ నివారణకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాకరలో సోడియం, కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ. విటమిన్-బీ6, ఫాంథోనిక్ యాసిడ్, ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి. కూరల్లో దీన్ని ఉపయోగించడం శ్రేష్టం. కనీసం పదిహేను రోజులకోసారైనా టీ స్పూన్ కాకర రసం తాగడం ద్వారా ఆరోగ్యంగా జీవించొచ్చు.
పొట్లకాయ: ఇందులో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థాలు పుష్కలం గా ఉంటాయి. ఏ, బీ, సీ విటమిన్లు, మాంగనీసు, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము అధికంగా ఉంటాయి. కడుపు ఉబ్బరం, తిమ్మిర్లు, మలబద్ధకాన్ని ఈ కాయ తొలగిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు పొట్లకాయ కషాయాన్ని తాగితే సత్వర ఉపశమనం కలుగుతుంది. మధుమేహాన్ని కూడా ఇది అదుపులో ఉంచుతుంది.
క్యారెట్: ఇందులో విటమిన్-ఏ ఎక్కువగా ఉంటుంది.
కంటి చూపును మెరుగుపర్చేందుకు ఇది దోహదపడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కంటిచూపును మెరుగుపరిచే బీటా-కెరొటిన్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే గంటకో క్యారెట్ తినాలి. క్యారెట్ గుండె పోటును పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి.
మొరంగడ్డ: ఆలుగడ్డ, కందగడ్డలో కన్నా మొరంగడ్డలో పీచు పదార్థం ఎక్కువ. విటమిన్-బీ6 పుష్కలంగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్ని ఈ విటమిన్ విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి. వీటిల్లోని విటమిన్-సీ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. విటమిన్-ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బెండకాయ
ఇందులోని మ్యూకస్ అనే పదార్థం కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. పీచు, విటమిన్- సీ ఇందులో చాలా ఎక్కువ. డయాబెటిక్ కారణంగా యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు గురయ్యే వారికి ఇది మంచి మందుగా పనిచేస్తుంది. బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరం తగ్గుతుంది.
ఆలు గడ్డ: పిండి పదార్థాల సమూహం ఆలుగడ్డ. వివిధ విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు లభిస్తాయి.
కీరదోసకాయ
వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా ఇందు లోని పొషకాలు, రీహైడ్రేటింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి. ఇందులో పోటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. విటమిన్-ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. కళ్ల కింద నల్లటి చారలను దోసకాయ ముక్కలు తొలగిస్తాయి. శిరోజాల ఎదు గుదలకు దోసలోని సల్ఫర్, సిలికాన్, దోహదపడుతుంది.
వంకాయ: ఇందులో విటమిన్లు, ఖనిజాలు, కీలకమైన ఫైటో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వంకాయ పొట్టులో ఉండే ఆంథోసియానిన్ ఫైటో న్యూట్రియెంట్ని న్యాసునిక్ అంటారు. ఇది యాంటీ ఆక్సీడెంట్ గా పనిచేస్తుంది. వంకాయలో ఎక్కువగా పోటాషియం ఉంటుంది. ఇది బీపీని తగ్గించేందుకు దోహదపడుతుంది.
ముల్లంగి: ఆరోగ్యానికి ఇదెంతో మంచిది. దుంపలన్నింట్లో తక్కువ కేలరీలు కలిగి ఉన్నది ముల్లంగే. తాజా దుంపలో విటమిన్-సీ ఎక్కువగా ఉంటుంది. సలొరాఫేన్ అనే యాంటీ యాక్సిడెంట్లు కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ప్రోస్ట్రేట్, రొమ్ము, ఓవరీ, కోలాన్ తదితర క్యాన్సర్ల చికిత్సలో సలొరాఫేన్ ప్రముఖపాత్ర వహిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మహిళల్లో మూత్రాశయ సమస్యలు తొలగించడంతో ముల్లంగి సహాయపడుతుంది. రోజుకు ఒక కప్పు ముల్లంగిని సలాడ్రూపంలో తీసుకుంటే విటమిన్-సీ పుష్కలంగా అందుతుంది. తెల్లరక్తకణాలూ వృద్ధి చెంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు లాంటి సమస్యలు దరి చేరనివ్వని గుణం ముల్లంగిలో ఉంది.
గోరు చిక్కుడు: ఇందులో ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని ఇది తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో చక్కగా పనిచేస్తుంది. పిండం అభివృద్ధికి సహకరిస్తుంది.
సోయా చిక్కుడు: సోయాబీన్స్ లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. నూనె తీసిన సోయాబీన్లో ప్రొటీన్ శాతం 45 నుంచి 48 వరకు ఉంటుంది. సోయాను పిల్లల ఆహార పదార్థాలు, బిస్కెట్స్, బ్రెడ్ల తయారీలో వాడతారు. సోయాలోని ప్రొటీన్లు మాంసంలోని ప్రొటీన్ల వంటివే.
పందిరి చిక్కుడు: దీని కాయలను కూరగాయగా, ఎండిన విత్తనాలను పప్పు దినుసులుగా వాడుతారు. బీన్స్ ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించొచ్చు.
ఫ్రెంచ్ చిక్కుడు(సన్న చిక్కుడు): ఇందులో ఖనిజ సిలికాన్ ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, కనెక్టివ్ కణజాలం ఆరోగ్యంగా ఏర్పడడానికి ఉపయోగపడుతుంది.
టమాట: ఇందులోని లైకోపిన్ అనే పదార్థం శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఎసిడిటితో బాధపడేవారు టమాటతో తయారు చేసిన వంటకాన్ని తింటే ఉపశమనం కలుగుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటంతో ఉత్తమమైన ఆహారంగా పరిగణిం చొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టమాటల్లో ఉండే విటమిన్-ఏ కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. జీర్ణశక్తిని పెంచే గుణం టమాటల్లో ఉంటుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, పక్షవాతం, గుండె జబ్బులు తగ్గడానికి టమాట దోహదపడుతుంది.
Authorization