కెమికల్ పీల్ మన చర్మాన్ని మరల రీజనరేట్ చేయగలదు. పీల్ అనేది స్కీన్ ఫ్రెండ్లీ ఫ్రూట్ ఆసిడ్ లిక్విడ్స్. ఇది స్కిన్‌ని కంట్రోల్ ... గ్రేడెడ్ రిపేరి చేసి స్కిన్‌లోని రెండు పొరలను రీమోడల్ చేస్తుంది. దీని వల్ల చర్మం ఫ్రెష్‌గా, కాంతి వంతంగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రూట్ లిక్విడ్స్‌ని చర్మాన్ని స్మూత్‌గా చేయడానికి వాడడం అనేది ప్రాచీన కాలంలో కూడా ఉండేది. క్లియోపాత్ర తన స్నానానికి పాలను వాడేది. పాలలో ఉండే లాక్టిక్ ఆసిడ్ స్కిన్‌ని స్మూత్, హైడ్రేట్ చేస్తుంది. ఫ్రెంచ్ ఉమెన్ కూడా ఓల్డ్ వైన్ ట్రార్టారిక్ యాసిడ్‌ని స్కిన్‌ని స్మూత్ చేయడానికి ఉపయోగించే వారు.
పీల్ యొక్క పెనిట్రేషన్ ఆధారంగా పీల్ని క్రింది విధంగా క్లాసిఫై చేయవచ్చు
సూపర్ ఫీషియల్ : ఇది చర్మం పై పొర అనగా ఎపిడెర్మిస్ని తొలగిస్తుంది.
మీడియమ్ : ఇది ఎపిడెర్మిస్, డెర్మిన్లో కొంత భాగాన్ని తొలగిస్తుంది.
డీప్ : ఇది ఎపిడెర్మిస్, డెర్మిస్‌ను తొలగిస్తుంది.
సాధారణంగా ఇండియన్ స్కిన్‌లో ఉపయోగించే పీల్స్ రకాలు :
గ్లైకోలిక్ పీల్( చెరుకు రసం)
లాక్టిక్ పీల్ ( పుల్లని పాలు)
సిట్రిక్ పీల్ ( సిట్రస్ పండ్లు)
సాల్సిలిక్ పీల్ ( వెంటర్ గ్రీన్ లివ్స్)
టి.సి.ఎ. సి (ట్రైక్లోరో ఎసిటిక్ యాసిడ్)
మాండేలిక్ (ఆల్ట్రాండ్స్)
రెటినోయిక్ యాసిడ్ (విటమిన్ ఎ డెరివేటివ్స్)
ఫినాల్ (కోల్టార్) ఫైటిక్ యాసిడ్ (రైస్ బ్రాన్)
ఉపయోగాలు
ఇది సులభమైన ఆఫీస్ పద్ధతి , దీనిని కొన్ని రకాల చర్మ సమస్యలలో వాడుతారు.
మొటిమలు, మొటిమల మచ్చలు, ఆయిల్ స్కిన్, ఓపెన్ పోర్స్, పిగ్మంటేషన్ స్రాబ్లుమ్స్, నల్ల మంగు, ఫెకిల్స్, మాక్యూలర్ ఆమైలాయిడోసిన్, ఫోటో ఏ జ్డ్ స్కీన్, ఫైన్ ప్రింకిల్స్ మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే మచ్చలు, మొటిమల వల్ల వచ్చే గుంతలు తగ్గించడానికి సాల్సీలిక్, గ్లైకోలిక్ మరియు . టి.సి.ఎ.సి పీల్స్ వాడుతారు. మంచి రిజల్డ్స్ కోసం మల్టిఫుల్ సిట్టింగ్స్ అవసరమవుతాయి.
పిగ్మెంటేషన్
నల్లమంగు, మొటిమల మచ్చలు, మాక్యూలార్ ఆమైలాయిడోసిస్, వంటి సమస్యలకు గ్లైకోలిక్ సాల్సిలిక్ నోమెలాన్, జెస్నర్స్ పీల్స్ మూజ్ చేస్తారు.
పీల్స్‌తో పాటు లేజర్స్ కూడా పిగ్మెంటేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది.
ఏజింగ్ స్కీన్
వయసుతో పాటు ముఖం, చేతులపై వచ్చే ముడతలు, పిగ్మంటేషన్ పీల్‌తో కొంత మేరకు తగ్గించవచ్చు. ఓల్డ్ ఏజ్‌లో యూజ్ చేసే పీల్స్
గ్లైకోలిక్,టిసిఏ, రెటినోయిక్ యాసిడ్ పీల్స్
మల్టిఫుల్ సెషన్స్ అవసరం అవుతాయి.
పీల్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1. పీల్ చేసే రెండు వారాల ముందు నుండి ప్రైమింగ్ క్రీములను వాడాలి.
కామన్‌గా వాడే ప్రైమింగ్ క్రీములు.
సన్‌స్క్రీన్స్
రెటినాయిడ్ క్రీములు. 0.025 - 0.05 శాతం
గ్లైకోలిక్ యాసిడ్ క్రీములు 8 - 12 శాతం
హైడ్రోక్వినోన్ క్రీమ్ 2 - 4 శాతం
ఈ క్రీమ్స్ స్కిన్‌ని పీల్ కోసం ప్రిపేరు చేస్తుంది.
పీల్ చేసే పద్ధతి:
1. పీల్ చేసే ముందు ముఖాన్ని సోప్‌తో, వాటర్‌తో వాష్ చేయాలి
2.45 డిగ్రీల హెడ్ ఎలివేషన్‌లో హెయిర్‌ని క్సాప్తో కవరు చేసి, స్కిన్ ఆసిటోన్, స్పిరిట్‌తో క్లీన్ చేయాలి. దీని వల్ల చర్మంపై ఆయిల్, డస్ట్ క్లీన్ అవుతుంది.
3. స్కిన్ ప్ల్రాబమ్కి అనుగుణంగా సరైన పీల్ని ముఖానికి ఆప్లై చేయాలి. మొదటగా నుదురు-రైట్ చీక్- చిన్- లెఫ్ట్ చీక్- నొసలు- ముక్కు- నోరు చుట్టు- కళ్ళ చుట్టు అప్లై చేసి, రివర్స్ ఆర్డర్లో తీసి వేయాలి.
పీల్ చేసిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
సన్ స్క్రీన్‌ని రోజుకి మూడుసార్లు ఆప్లై చేయాలి
మైల్డ్ సోప్స్‌ని వాడాలి
స్కిన్ ని స్క్రాచ్ చేయకూడదు
పార్లర్ ట్రీట్ మెంట్ వారం నుంచి పది రోజుల వరకు తీసుకోకూడదు
ఐస్ కంప్రెషన్స్
హెర్సెన్ ట్రీట్మెంట్ ( హెర్పస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి)
వీరికి వద్దు..
పీల్ ట్రీట్మెంట్ అందరికీ సరిపోదు. కొంతమందికి ఈ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు.
మొటిమలు ఇన్ఫెక్షన్
ఓపెన్ కట్స్ , ముఖంపై స్క్రాచ్ మార్క్ప్
హెర్పెస్ ఇన్ఫెక్షన్
సన్ ఆలర్జి స్కారింగ్ ఉన్నవారు
పైన చెప్పిన విధంగా పీల్స్ అనేవి చర్మ సమస్యలకు చాలా ఉపయోగకరమైన ట్రీట్మెంట్. కొన్ని జాగ్రత్తలు..
సరైన పేషెంట్ ఎంపిక చేసుకోవాలి.
సన్ ప్రోటెక్షన్
ప్రీ అండ్ పోస్ట్ పీల్ కేర్
ప్రాపర్ ట్రైయిన్డ్ డెర్మటాలజిస్ట్‌తో మాత్రమే పీల్ ట్రీట్ మెంట్ తీసుకోవాలి.
- డాక్టర్ శోభారెడ్డి డి.,
కాస్మటిక్ డెర్మటాలజిస్ట్,
డాక్టర్ శోభాస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్,
హైదరాబాద్.
Authorization