ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ కారణంగా చాలామంది బ్రౌన్‌రైస్ వాడుతున్నారు. మమూలు బియ్యంతో పోల్చితే బ్రౌన్‌రైస్‌లో మాంగనీస్, పాస్ఫరస్ రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్తో బాధపడేవారికి బ్రౌన్‌రైస్‌తో చాలా మేలు జరుగుతుంది. వారంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు వైట్ రైస్ తీసుకుంటట మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. అయితే బ్రౌన్ రైస్ తీసుకునేవారికి డయాబెటిస్ ముప్పు వుండదు. జీవక్రియల పనితీరు మెరుగుపడటానికి అవసరమయ్యే థయామిన్ బ్రౌన్‌రైస్‌లో పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఉండే ఇనోసిటల్ హెక్సాఫాస్పేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుంది. స్థూలకాయంతో బాధపడేవారు, బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్న వారు బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక కప్పు బ్రౌన్‌రైస్‌లో రోజు తీసుకోవాల్సిన మెగ్నీషియం శాతంలో 21 శాతం లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మైగ్రేన్ సమస్యను అరికడుతుంది. ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే ఫోలసిన్ బ్రౌన్‌రైస్‌లో ఉంటుంది. శిశువుల్లో మెదడు ఎదుగుదల, వెన్నెముక ఎదుగుదల సరిగ్గా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. అందుకే గర్భిణిలు బ్రౌన్‌రైస్ తీసుకోవడం చాలా మంచిది. బ్రౌన్‌రైస్‌ను రోజులో ఒక సారి తీసుకున్నా సరిపోతుంది. అయితే నెమ్మదిగా, పూర్తిగా నమిలి తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశెకు బదులుగా అరకప్పు బ్రౌన్‌రైస్‌ను తీసుకోవచ్చు. లంచ్‌లో సాధారణ మీల్స్‌కు బదులుగా బ్రౌన్‌రైస్ పలావు తినవచ్చు.