మధుమేహ నియంత్రణలో ఆహార, వ్యాయామాలతో సమానంగా నిద్ర పాత్ర కూడా అంతే కీలకమని ఇటీవలి పరిశోధనలు మరింతగా స్పష్టం చేస్తున్నాయి. రకరకాల మందులు వాడిన దానికంటే ఆహారపు అలవాట్లను మార్పుకోవడం ద్వారా మధుమేహం అదుపులో ఉంచుకోవచ్చని ఇప్పటికే చాలా పరిశోధనల్లో వెల్లడైంది. అయితే.. ఆహార అలవాట్లను మార్చుకోవడం ద్వారా టైప్-2 మధుమేహాన్ని పూర్తిగా తగ్గించవచ్చంటున్నారు ఫిజిషియన్స్ కమిటీ ఫర్ రెస్పాన్సిబుల్ మెడిసిన్ పరిశోధకులు. ఆహార అలవాట్లతో మార్పులు చేసుకోవడం వల్ల కణాల్లోని కొవ్వు తగ్గడమే కాకుండా ఇన్సులిన్ పనితీరు మెరుగు పడుతుందని, సమయపాలన పాటిస్తూ.. ఆహారం తీసుకోవడం ద్వారా చక్కెరవ్యాధిని నివారించవచ్చు. అంతేకాదు నిద్రతోనూ మధుమేహ సమస్య ను తగ్గించవచ్చుని పరిశోధనల ద్వారా వెల్లడైంది. మంచినిద్రతో నిద్రలేమి సమస్య ఇన్సులిన్ పనిచేయకుండా నివారిస్తుంది. అంతేకాదు గ్లూకోజ్ జీవక్రియా వ్వవస్థనే నిద్రలేమి అస్తవ్యస్తం చేస్తుందని కోల్‌కాతాలోని ఎఎమ్ఆర్ఐ ఆసుపత్రి డాక్టర్ల పరిశోధనలో బయట పడింది. ఎక్కువ రాత్రులు ఆరుగంటల కన్నా తక్కువగా నిద్రించే వాళ్లల్లో షుగర్ నిలువలు పెరిగే పరిస్థితి మిగతా వారి కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుందని యానల్ప్ ఆఫ్ ఎపిడెమియాలజీ పరిశోధనలో స్పష్టమయ్యింది. డచ్ పరిశోధకులు వారు నిర్వహించిన సర్వే ప్రకారమైతే అప్పుడప్పుడు నిద్రలేమికి గురైనా, శరీరంలో ఇన్సులిన్‌ను వినియోగించుకునే సామర్థ్యం తగ్గిపోతుందని స్పష్టమైంది. అమెరికాలో జరిగిన మరో పరిశోధనలో తక్కువ సమయం నిద్రించే వారి శరీరం బరువు పెరిగే అవకాశ ముందని, ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రించే 87 వేల మందిలో 33 శాతం మంది అధిక బరువు పెరిగారు. నిద్రలేమి వల్ల ఆకలిని క్రమబద్ధం చేసే హార్మోన్ల , గ్రెలిన్ల ఉనికిని దెబ్బ తింటుందని కూడా వారు కనుగొన్నారు. సహజంగా కొంత మందికి ఏడు గంటలకు పైగా అవసరం ఉంటుంది. కానీ, వారంతా అంతకన్నా తక్కువ సమయమే నిద్రిస్తున్నారు. అయితే ఎన్ని గంటలు నిద్రిస్తున్నా మనేది ఎంత ముఖ్యమో, ఎంత గాఢంగా నిద్రించారన్నది కూడా అంతే ముఖ్యం అంటున్నారు పరిశోధకులు. నిద్రలో మధ్యలో పదే పదే మెలకువ వస్తే అది కూడా షుగర్ నిలువలు పెరగడానికి దారి తీస్తుందని వీరు స్పష్టం చేస్తున్నారు.