మనిషి ఆధునికంగా ముందుకు వెళ్లే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా అదే రీతిన చుట్టుముడుతున్నాయి. వైద్య పరిజ్ఞానం బాగా పెరగడం వల్ల ప్రాణాంతాక వ్యాధుల నుంచి చాలా వరకు బయటపడుతున్నా.. ఆ వ్యాధుల నివారణలో వాడే ఔషధాల వల్ల పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. ఆ దుష్ప్రభావాలను తగ్గించడంలో భారతీయ సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం విశేషమైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా క్యాన్సర్ నివారణకు ఉపయోగించే కీమోథెరపీలో శరీరంపై పలు రకాల చెడు ప్రభావం పడుతుంది. దానిని ఆయుర్వేద వైద్యంతో నివారించవచ్చు.
క్యాన్సర్ కేర్
క్యాన్సర్‌ను నివారించడానికి డాక్టర్లు ఎన్నో రకాల పద్ధతుల్ని అవలంభిస్తారు. అందులో ముఖ్యమైంది కీమోథెరపీ. ఈ థెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను రసాయనాలతో తుదముట్టిస్తారు. మానవ శరీరంలోకి రసాయనాలు ప్రవేశించినప్పుడు వాటితో పాటు వాటి విషప్రభావాలూ చేరుతాయి. మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేది కాలేయం, మూత్రపిండాలు. ఈ రెండు అవయవాలు.. ఒక పరిమితి మేరకు మాత్రమే విష పదార్థాలను బయటకు పంపగలవు. వాటికి శక్తి మించి వచ్చిన విష పదార్థాలు శరీరంలో పేరుకుంటాయి. కీమో థెరపీ వల్ల వచ్చే విష పదార్థాలను కాలేయం, మూత్రపిండాలు పూర్తిగా వడపోయలేవు. దీనివల్ల ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తికి వికారం, వాంతులు, ఒళ్లు నల్లబడటం, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. వీటినే మనం సైడ్ఎఫెక్ట్స్ అని అంటుంటాం. క్యాన్సర్ రోగులు చికిత్సకు బాగానే స్పందిస్తారు. కానీ కీమో తీసుకుంటున్న ప్రతివారూ చాలా బలహీనంగా మారిపోతారు. బలంగా మారడానికి వాళ్లు బాగా తినాలి. ఒక్కోసారి క్యాన్సర్ మందుల చెడు ప్రభావం వల్ల వాంతులవుతాయి. దీనివల్ల తిన్న తిండి ఒంటికి పట్టదు. ఇలాంటి సమస్యలకు ఆయుర్వేదంలోని మూలికా చికిత్స (హెర్బల్ మెడిసిన్) పరిష్కార మార్గం చూపుతుంది. తొలుత వికారాన్ని తగ్గించి రోగులు బాగా తినేలా చేస్తుంది. దాంతో తిన్నది వంటబడుతుంది. ఫలితంగా రోగులు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోగలుగుతారు.
క్యాన్సర్ ఎందుకొస్తుంది?
నిర్దిష్టంగా క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలియదు. చాలా కారణాల వల్ల ఈ మహమ్మారి వస్తుంటుంది. ప్రధానంగా 16 కారణాల వల్ల క్యాన్సర్ వస్తుంటుంది. అవి: 1. జీవనశైలిలో అనూహ్య మార్పులు 2. జన్యుపరంగా మార్పులు చెందిన ఆహారం, 3. వాతావరణ కాలుష్యం 4. పొగ, మద్యం 5. మానసిక, ఉద్వేగపరమైన ఒత్తిడి 6. ఇన్ఫ్లమేషన్ (మంట) 7. మలబద్దకం 8. కీలక విటమిన్ల లోపం 9. అధికంగా రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్లను తీసుకోవడం 10. హార్మోన్ల అసమతుల్యత 11. ఆమ్లయుతమైన ఆహారాలు (అసిడిక్ ఫుడ్) ఎక్కువగా తీసుకోవడం 12. ఎరువులు, క్రిమిసంహార మందుల ప్రభావానికి గురికావడం 13. దగ్గరి వారిని కోల్పోవడం 14. కొవ్వులతో కూడిన (ట్రాన్స్ ఫ్యాట్స్) ఎక్కువగా తీసుకోవడం 15. ఒంట్లో, మనసులో పేరుకున్న విష పదార్థాలను విసర్జించలేకపోవడం 16. రేడియేషన్‌కు గురికావడం.
వీలైనంత వరకు ఆరోగ్యకరమైన అలవాట్లను జీవనశైలిని అనుసరించడం ద్వారా క్యాన్సర్‌ను దరి చేరనీయకుండా చూసుకోవచ్చు.
పంచకర్మ
పంచకర్మ ప్రక్రియ.. శరీరంలోని అంతర్గత అవయవాలను పరిశుభ్రం చేస్తుంది. ఐదు పద్ధతుల్లో సాగుతుంది కాబట్టి దీనికి పంచకర్మ చికిత్స అని అంటారు. ఆ ఐదు పద్ధతులు వమన, విరేచన, వస్తి, నస్య, రక్తమోక్ష చికిత్సలు. వీటిని రాధాస్ ఆయుర్వే వెల్నెస్ సీకర్ల ఆరోగ్య పరిస్థితులను బట్టి అందిస్తుంది.
డాక్టర్ అదితి కులకర్ణి,
డైరెక్టర్ మెడికల్ సర్వీస్,
రాధాస్ ఆయుర్వే ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్, గచ్చిబౌలి, హైదరాబాద్.
Authorization