చలికాలంలో చర్మం పొడిగా మారటానికి చలి ఒక్కటే కాదు కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. రోజువారి పనులు, వాడే మందులు కూడా కారణం కావచ్చు. చలికాలంలో ముఖం కడుక్కోవాలన్న కూడా వేడి నీటినే ఉపయోగిస్తాం. ఇంకా స్నానానికైతే మరిగే నీరు కావాల్సిందే. కానీ, వేడి నీరు చర్మంలో ఉండే సహజ తేమ, నూనెలను కోల్పోయేలా చేసి, చర్మాన్ని పొడిగా మారుస్తుంది. వేడి నీటిని కాకుండా, గోరు వెచ్చగా ఉండే నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా కాపాడుకోవచ్చు. చలికాలం వచ్చిందంటే చాలు టోనర్స్, లోషన్, బాడీ క్రీములు వాడుతారు. వీటిలో కొన్ని రకాల ఉత్పత్తుల్లో ఆల్కహాల్ ఉంటుంది. వీటిని వాడకం వలన చర్మం తన సహజ తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. చర్మం పొడిగా ఉండకూడదు అంటే ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించే మందులు, కేన్సర్ నివారణా మందులు వాడుతున్న వారిలో పొడి చర్మంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రకమైన మందుకు వాడే వారిలో చర్మం పొడిగా మారి పొలుసులుగా రాలుతుంది. కొంతమందిలో పొడిచర్మం అనేది హెరిడిటీగా కూడా రావచ్చు. చలికాలంలో చర్మం పొడిబారితే ఇబ్బంది పడకుండా సరైన కారణం తెలుసుకోవాలి.