కొన్ని ప్రాంతాల్లో సీమ మేడిపండుగా కూడా పిలిచే అంజీరలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి శరీరానికి అవసరమైన పోషకాలను ఇది అందిస్తుంది. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి లవణాలు అంజీర పండులో సమ ద్ధిగా ఉంటాయి. అయితే, అధిక రక్తపోటు పీడితులకు ఈ పండ్లు ఇచ్చినప్పుడు గరిష్ట రక్తపోటు (సిస్టాలిక్) 13 పాయింట్లు, కనిష్ట రక్తపోటు (డయాస్టాలిక్) 5 పాయింట్లకు తగ్గినట్లు పరిశోధనల్లో వెల్లడయ్యింది. మాంస క త్తులు, పిండిపదార్థాలు, కొవ్వు తక్కువ గానూ, నీరు ఎక్కువగానూ ఉండటంతో బరువు నియంత్రణలో ఉండడానికి తోడ్పడుతుంది. ఎప్పుడూ ఆకలితో ఉంటూ, కనిపించిన ప్రతి ఆహార పదార్థాన్నీ ఆబగా తినేస్తూ కొందరు ఊబకాయాన్ని తెచ్చుకుంటారు. అలాంటి వారు అంజీర పండ్లను తింటే, వాటిలోని పీచుపదార్థం, క్యాల్షియం, ఐరన్ ఆకలిని తగ్గించడం ద్వారా క్రమంగా బరువును తగ్గిస్తాయి. అంజీర పండ్లలోని క్యారటోన్లు, ల్యూటిన్, టాన్నిస్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు, కరిగిపోయే పీచు పదార్థం ఆరోగ్యం స్థిరంగా ఉండేలా చేస్తాయి. ఈ పండ్లలో ఎ, ఇ, కే విటమిన్లు తగినంత ఉంటాయి. కేలరీలు కూడా చాలా తక్కువగా అంటే దాదాపు 100 గ్రాముల పండ్లలో 74 కేలరీలే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో సీమ మేడిపండుగా కూడా పిలిచే అంజీరలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి శరీరానికి అవసరమైన పోషకాలను ఇది అందిస్తుంది. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి లవణాలు అంజీర పండులో సమ ద్ధిగా ఉంటాయి. అయితే, అధిక రక్తపోటు పీడితులకు ఈ పండ్లు ఇచ్చినప్పుడు గరిష్ట రక్తపోటు (సిస్టాలిక్) 13 పాయింట్లు, కనిష్ట రక్తపోటు (డయాస్టాలిక్) 5 పాయింట్లకు తగ్గినట్లు పరిశోధనల్లో వెల్లడయ్యింది. మాంస క త్తులు, పిండిపదార్థాలు, కొవ్వు తక్కువ గానూ, నీరు ఎక్కువగానూ ఉండటంతో బరువు నియంత్రణలో ఉండడానికి తోడ్పడుతుంది. ఎప్పుడూ ఆకలితో ఉంటూ, కనిపించిన ప్రతి ఆహార పదార్థాన్నీ ఆబగా తినేస్తూ కొందరు ఊబకాయాన్ని తెచ్చుకుంటారు. అలాంటి వారు అంజీర పండ్లను తింటే, వాటిలోని పీచుపదార్థం, క్యాల్షియం, ఐరన్ ఆకలిని తగ్గించడం ద్వారా క్రమంగా బరువును తగ్గిస్తాయి. అంజీర పండ్లలోని క్యారటోన్లు, ల్యూటిన్, టాన్నిస్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు, కరిగిపోయే పీచు పదార్థం ఆరోగ్యం స్థిరంగా ఉండేలా చేస్తాయి. ఈ పండ్లలో ఎ, ఇ, కే విటమిన్లు తగినంత ఉంటాయి. కేలరీలు కూడా చాలా తక్కువగా అంటే దాదాపు 100 గ్రాముల పండ్లలో 74 కేలరీలే ఉంటాయి.
Authorization