మద్యపానం తీసుకోవడంతో ఆరోగ్యం పాడవుతుందన్న విషయం
ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినప్పటికీ చాలామంది మద్యం తీసుకోవడం మానలేకపోతున్నారు. కొన్నేండ్లుగా పెరుగుతున్న మద్యం వాడకం కారణంగా ప్రజల్లో అనారోగ్య పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి. తాగుడు వల్ల ఆరోగ్య సమస్యలే కాక, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. తాగుడుకు అలవాటు పడిన వారి పని సామర్థ్యం తగ్గి పోతుంది.
ఒక వ్యక్తి ప్రతిరోజూ ఆల్కహాల్ ను తీసుకుంటే అది శరీరంలో హానికరమైన ప్రభావాలను చూపుతుంది. మద్యంతో వచ్చే వ్యాధుల గురించి మరింత సమాచారం..
గుండె వ్యాధులు: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల సాధారణంగా రక్తంలో కొవ్వు పదార్ధం మరియు శరీరం యొక్క రక్తపోటు పెరుగుతుంది.రక్తపోటు ఎక్కువగా ఉంటే, అది గుండెను ప్రభావితం చేస్తుంది.అంతే కాకుండా ఇది శరీరం యొక్క మంచి కొలెస్ట్రాల్ స్థాయి మీద ప్రభావితం చేసి గుండె పోటు అపాయాలను పెంచుతుంది.
మూత్రపిండాల పనితీరు పై ప్రభావం : ప్రతి రోజు ఆల్కహాల్ తీసు కోవటం వల్ల సాధారణంగా మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. ఈ ఆల్కహాల్ సాధారణంగా హార్మోన్ ల పనితీరు మీద ప్రభావితం చేసి, కొన్ని సమయాల్లో మూత్రపిండ వైఫల్యం కుడా సంభవించవచ్చు .
కాలేయం దెబ్బతింటుంది : మద్యం అధికంగా తీసుకోవడంతో కాలేయం పాడైపోతుంది. దీంతోపాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఎన్నో పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం కాలేయం మీద ఎక్కువగా ప్రభావం చూపు తుంది.ఆల్కహాల్ కాలేయంలో కొవ్వును పెరిగేలా చేస్తుంది.అందువల్ల కాలేయం పాడయ్యి ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఇతర అనేక వ్యాధులకు కారణం అవుతుంది. ఆహారం జీర్ణం కావడంలో సమస్యలు తలెత్తుతాయి.
మధుమేహం: శరీరం యొక్క రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం యొక్క రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఈ పరిస్థితి మధుమేహ వ్యాధి రావడానికి కారణమవుతుంది.రక్తంలో చక్కెర స్థాయి అధిక స్థాయిలో ఉంటే రక్త నరాల్లో సమస్యలు వస్తాయి. రక్తనాళాలు మూసుకుపోయి రక్తప్రసరణ వ్యవస్థ నాశనానికి కారణమవుతుంది. అధిక మద్యపానం శాశ్వతంగా నరాల హానిని కూడా కలిగించవచ్చు.
జీర్ణ సమస్యలు : ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ వాహిక అంతర్గత పూతకు నష్టం కలిగుతుంది. ఈ కారణంగా జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. ఇది పొట్టలో పుండ్లు(అల్సర్), పొట్టకు సంబంధించిన ఇతర సమస్యలతో పాటు పెద్దప్రేగు కాన్సర్కు దారితీస్తుంది.
క్యాన్సర్: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణావయవాలలో నోరు, గొంతు, కంఠనాళం, కడుపు, శ్వాసా వయవాలు, క్యాన్సర్ వ్యాధికి గురయ్యే ప్రమాద ముంది. కాలేయం క్యాన్సర్కు మద్యపానానికి దగ్గరి సంబంధం ఉంది. తాగుడు వల్ల ఆరోగ్య సమస్యలే కాక, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. తాగుడుకు అలవాటు పడిన వారి పని సామర్థ్యం తగ్గి పోతుంది.
మెదడు:ఆల్కహాల్ వల్ల ప్రత్యక్షంగా కంటి చూపును, జ్ఞాపకశక్తి కోల్పోతారు. మెదడు సాధారణ పనితీరు మీద ఆల్కహాల్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అధిక మద్యపానం అసందర్భ సంభాషణ, అనైతిక ప్రవర్తనకు కారణమవుతుంది. ఆలోచన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
బరువు: అధిక బరువు పెరగడానికి ఆల్కహాల్ కారణం. ప్రతి రోజు మద్యం సేవించడం ద్వారా అధిక కేలరీలు తీసుకోవటం వల్ల స్థూల కాయం వంటి సమస్యకు కారణమవుతుంది.ఈ కారణంగా బరువులో హెచ్చుతగ్గులు రావడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అధిక రక్తపోటు పెరుగుతుంది.
చర్మం: చర్మం మీద ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ ప్రభావం శరీరంనకే పరిమితం కాలేదు,చర్మానికి కూడా హాని చేస్తుంది.ఆల్కాహాల్ వాడకం వల్ల కండ్ల కింద నల్లని వలయాలు, కండ్లు ఉబ్బినట్లు ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి.
రక్తహీనత: మద్యం ఎక్కువగా తీసుకునేవారిలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గి పోయి వారిలో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది. రక్తం గడ్డ కట్టే గుణం క్రమంగా తగ్గిపోయి.. రక్తహీనత వస్తుంది.
లైంగిక వాంఛ: పురుషుల్లో మద్యపానం వల్ల లైంగిక వాంఛ తగ్గిపోతుంది. మితిమీరి మద్యం తాగితే పురుషత్వ హార్మోన్ల ఉత్పత్తిలో మార్పులు వస్తాయి. అలాగే మానసిక, శారీరక ఒత్తిడి టెస్టోస్టీరాన్ స్థాయిని త్వరగా కుంగదీస్తుంది. అకస్మాత్తుగా కార్టిసాల్ పెరగడానికి ఒత్తిడి కారణమవుతుంది. మద్యం ఎక్కువగా తాగేవారిలో హార్మోన్స్ కూడా ఎక్కువ ఉత్పత్తి కావు. అంతేకాకుండా గుండెజబ్బులు, ఎముకలు బలహీనపడటం వంటివి కూడా జరుగుతాయని ఇటీవల పరిశోధనలో తేలింది.
సంతానలేమి: జననేంద్రియ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది: ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల శరీరం యొక్క జననేంద్రియ వ్యవస్థ నాశనానికి కారణం అవుతుంది. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల పరోక్షంగా సంతానలేమి సమస్య వస్తుంది.
సరదా ప్రారంభమై వ్యసనంగా మారి మిమ్ముల్ని అనారోగ్యం పాలు చేసే మద్యానికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
డాక్టర్ స్వామి అల్వాల్,
ఎం.బి.బిఎస్(ఉస్మానియా), ఎండీ(నేచరోపతి)
సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీజీహెచ్ఎస్(రిటైర్డ్)
మల్లునరసింహా రెడ్డి స్మారక ప్రజా వైద్యశాల
ఎం.హెచ్.భవన్, అజామాబాద్, హైదరాబాద్
Authorization