ల్వేస్టేషన్‌లో, బస్‌స్టాండ్‌లో చాలామంది టైమ్‌పాస్ కోసం పల్లీలు తినడం గమనిస్తుంటాం. అయితే ఇలా కాలక్షేపం కోసమే తిన్నా.. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేయించిన పల్లీలతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాల్లో ఎన్నో ఉన్నాయి. అందుకే వీటిని 'బ్రెయిన్ ఫుడ్' అని కూడా పిలుస్తారు. వీటిలో అధికంగా ఉండే విటమిన్‌బి3 ఇందుకు కారణం. ఈ పోషకం మెదడు చురుకుదనాన్ని పెంచడమే కాకుండా... జ్ఞాపకశక్తి మెరుగయ్యేలా చేస్తుంది. మన మెదడులో స్రవించే సెరటోనిన్ అనే రసాయం వల్ల మన మూడ్స్ బాగుంటాయి. పల్లీలు తిన్నప్పుడు అందులోని ట్రిప్టోఫాన్ అనే అమైనోయాసిడ్ మెదడులోని సెరటోనిన్ వెలువడటానికి తోడ్పడుతుంది. దాంతో మూడ్స్ బాగుపడటంతో పాటు డిప్రెషన్ కూడా తగ్గుతుంది. అందుకే నిరాశలో, నిస్ప హలో ఉన్నవారు టైంపాస్ కోసం పల్లీలు తింటే మూడ్స్ బాగుపడి డిప్రెషన్ దూరమవుతుంది. వీటిలో విటమిన్ బికాంప్లెక్స్లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్ చాలా ఎక్కువ. అవి గర్భవతులకు ఎంతో మేలుచేస్తాయి. ఇక విటమిబి3గా పిలిచే నియాసిన్ పుష్కలంగా ఉన్నందున ఇది గుండెజబ్బుల ముప్పును నివారిస్తుంది. సో.. టైమ్‌పాస్ కోసం తిన్నా పల్లీలు ఆరోగ్యానికి మంచివే..!