తీసుకునే రకరకాల కూరగాయలు మనకు ఎంతో మేలు చేస్తాయి. వాటిలోని ప్రత్యేకగుణాలు శరీరధర్మప్రక్రియలను వేగవంతం చేస్తాయి. చాలామంది తినడానికి ఇష్టపడని ముల్లంగిలో ఎన్నో ఔషధగుణాలున్నాయి. మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంలో ముల్లంగి బాగా పనిచేస్తుంది. ముల్లంగిని ఆకులతో సహా వండుకుని తింటూ ఉంటే రాళ్లు ఏర్పడే అవకాశమే ఉండదు. ముల్లంగి జ్యూస్ని తరుచూ సేవిస్తూ ఉంటే కాలేయ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. పచ్చి ముల్లంగి దుంపలు, ఆకుల రసాన్ని వారానికి ఒకసారి తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. కాలేయం సమర్ధవంతంగా పనిచేస్తుంది. కొన్ని రకాల లివర్ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఆగకుండా వెక్కిళ్లు వస్తున్నప్పుడు కాస్తంత ముల్లంగి రసం తాగితే వెంటనే తగ్గిపోతాయి. విపరీతమైన జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న వారు ముల్లంగి రసం తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.ముల్లంగి విత్తనాలను బాగా ఎండబెట్టి, మెత్తగా దంచి, ఆ పొడిని అన్నంలో రోజూ కలుపుకుని తింటూ ఉంటే స్త్రీలల్లోని రుతు సంబంధ వ్యాధులు నయమవుతాయి.ముల్లంగి రసానికి నాలుగో వంతు నువ్వుల నూనె కలిపి, నూనె మాత్రమే మిగిలేలా కాచి భద్ర పరుచుకోవాలి. ఈ నూనెను వడబోసి చెవిపోటు బాధిస్తున్నప్పుడు, చెవిలో హౌరులాంటి సమస్య ఉన్నప్పుడు చెవిలో కొన్ని చుక్కలు వేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. కీళ్లవాపులు, నొప్పులు ఉన్న చోట ఈ నూనెతో మర్ధన చేస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.ముల్లంగి ఆకుల్ని, దుంపని ఎండబెట్టి, మెత్తగా దంచి, ఆ పొడిని తేనెతో కలిపి రోజుకు ఒక చెంచా చొప్పున తీసుకుంటే, శరీరంలోని ఏ అవయంలోనైనా వాపు, నొప్పి ఉంటే తగ్గిపోతాయి.