- నల్ల ద్రాక్షలోని యాంటీయాక్సిడెంట్లు గుండెను కాపాడతాయి. రోజూ అరకప్పు ద్రాక్షను తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. - పరగడుపున తీసుకునే చిక్కని ద్రాక్ష రసం మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. - ద్రాక్షలో ఉండే రిస్ అనే పాలీఫినాల్ మతిమరుపు రాకుండా చేసి మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది. ష ద్రాక్షలో ఉండే టిరోస్టిల్బీన్ అనే పదార్థం రక్తంలో కొవ్వు మోతాదును తగ్గించి రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. - పెద్దవాళ్ల కంటిలో శుక్లాలు ఏర్పడి చూపు మందగిస్తుంది. రోజూ ద్రాక్షను తీసుకుంటే శుక్లాలు ఏర్పడే అవకాశాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. పిల్లల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. - ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వైరల్ జ్వరాలు రాకుండా అడ్డుకుంటాయి. - ఉబ్బసం, అజీర్తి, మలబద్ధకం, డయేరియా వంటి వ్యాధులు, దంత సంబంధ వ్యాధులను అరికట్టడంలో ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. ు