పిండి పదార్థాలు, మాంకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, లవణాలు, న్యాచురల్ ఎంజైమ్లు, పీచుపదార్థాలు. ఈ ఏడు రకాల ముడి సరుకులు శరీరపోషణకు కనీస అవసరాలు. ఆకలి అవసరాన్ని తీర్చడం అంటే, ఈ ఏడు పోషక విలువలను అందించడమే! సన్నటి వారితో పోలిస్తే, లావు ఉన్న వారిలో ఎక్కువ పోషకాలు ఖర్చు అవుతాయి. ఆ మేరకు మళ్లీ ఆ పోషకాలను అందించాల్సిందే. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఏ పోషకాలను ఎక్కువగా తినాలి? ఏ పోషకాలను తగ్గించాలి అనే విషయంలో ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి.
ే విటమిన్లు, లవణాలు, న్యాచురల్ ఎంజైమ్లు మిగతా వాటికన్నా ముఖ్యమైనవి. ఎంత ఎక్కువ బరువు ఉన్నా, ఆహారంలో వీటిలోపం ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి. నిజానికి, ఇవేవీ శరీరం బరువును పెంచేవి కావు. కానీ, శరీరాన్ని పోషించడంలో మాత్రం కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. శరీర కణాలు రోగాల బారిన పడకుండా కాపాడుతుంటాయి. రోగనిరోధకశక్తిని పెంచడంతో పాటు త్వరగా కోలుకునేలా చేస్తాయి.
ే శరీర నిర్మాణంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించేవి మాంసకృత్తులు. రోజుకు ఒక కేజీ శరీర బరువుకు ఒక గ్రాము ప్రొటీన్లు అవసరం. అంటే 60 కేజీలున్న మనిషికి రోజుకు 60 గ్రాములు కావాలి. అదే ఎదిగే వయసు పిల్లలకైతే రెట్టింపు అవసరం. మన శరీరంలో ప్రతి రోజూ కోటానుకోట్ల కణాలు చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలను నిర్మించుకునేందుకు శరీరానికి మాంసకృత్తులు కావాలి. కొన్ని కణాలు జబ్బున పడుతుంటాయి. వాటిని రిపేరు చేయడానికి కూడా మాంసకృత్తులు అవసరం. హానికారకమైన బ్యాక్టీరియా, వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటి నుండి మనల్ని కాపాడే యాంటీబాడీస్ తయారీకి కూడా మాంసకృత్తులే ఆధారం. అందువల్ల బరువు తగ్గాలనుకునేవాళ్లు మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలనే ఎక్కువగా తీసుకోవాలి. అయితే జంతు సంబంధమైన మాంసకృత్తులకు వెళ్లకుండా, వృక్ష సంబంధమైన మాంసకృత్తులు తీసుకోవడం శ్రేయస్కరం.
ే బరువు తగ్గించుకోవాలని తిండిని తగ్గించేవారు కొవ్వు పదార్థాలను పూర్తిగా తగ్గించివేస్తారు. ఇది ఆరోగ్యానికి నష్టదాయకమే. వాస్తవానికి కణాల పొరల నిర్మాణానికీ, కణాల పనితీరుకూ, విటమిన్లలా శరీరాన్ని నడిపించానికి, కావలసిన శక్తినివ్వడానికి రోజుకు 20 నుంచి 25 గ్రాముల కొవ్వు పదార్థాలు అవసరం. కాకపోతే అంతకు మించి కొవ్వు పదార్థాలు తింటే నష్టదాయకమే! ఏమైనా, బరువు తగ్గాల్సిన వారు తీసుకునే ఆహారం తక్కువ శక్తిని, ఎక్కువ పోషకాలను అందించేదిగా ఉండాలి. అంతేతప్ప బరువు తగ్గాలని పొట్టను మాడ్చవలసిన అవసరం లేదు.
Authorization