ఛాతీలో మంట, అలర్జీలు, ఆందోళన, కుటుంబ నియంత్రణ, నొప్పి నివారణకు వాడే మందులతో తలెత్తే దుష్ప్రభావాల్లో డిప్రెషన్ ఒకటి. సుమారు 37శాతం మంది ఒత్తిడి తగ్గడానికి ఏదో ఒక మందును వేసుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మందుల రకాలు ఎక్కువవుతున్నకొద్దీ కుంగుబాటు ముప్పూ పెరుగుతుంది. అలా కాకుండా మనం తీసుకునే ఆహారంతో ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లను కూడా ఒక దశకు వచ్చే సరికి నియంత్రణ చేయాలి.ఎక్కువశాతం ఒత్తిడికి గురయ్యే వారిలో పురుషుల కన్నా మహిళలే ముందు వరుసలో ఉంటున్నారని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే వైద్యుల వద్దకు వెళ్లి సైడ్‌ఎఫెక్ట్‌లు కలిగించే మందులను ఊరికే వాడకుండా సహజసిద్ధంగా ఒత్తిడిని తగ్గించే కొన్ని ఆహారపదార్ధాలు తీసుకోవడం ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు.
అరటిపండు : దీనిలో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్‌ను సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలు .
బంగాళ దుంప : జింక్, విటమిన్ సి పెరిగి రోగని రోధకశక్తి ఇనుమడించి మనస్సును ద ఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
బొప్పాయి: దీనిలో ఉండే కెరోటిన్ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే ఒత్తిడి తగ్గిపోతుంది.
ఆరెంజ్ : అత్యధికంగా కమలాల్లో లభించే సి విట మిన్ వల్ల ఒత్తిడి ఫలితంగా ప్రభావం చూపే హార్మో న్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది.
చాక్లెట్ : వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్ (పిఇఎ) ఎండార్ఫిన్ స్థాయిల్ని తొలగించి సహజసి ద్దమైన యాంటీడిప్రెటస్సెంట్గా పనిచేస్తుంది.
యాప్రికోట్: ఇందులోని కెరోటిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.,
పెరుగు: విటమిన్ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది.
గోధుమ: ఇందులో అధికంగా ఉండే ఐరన్ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది.
చేపలు: స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. వీటిలో అధికంగా లభించే ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు మానసికాందోళనను తగ్గిస్తాయి.
పాలు: ఇందులోని ల్యాక్టోస్ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి.
ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా మందులు వాడితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
Authorization