సాధారణంగా రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అనేక వ్యాధులు దాడి చేస్తుంటాయి. అలర్జీలతో కూడా ఫీవర్ వస్తుంది. ఇది శరీరంలోని యాంటీబాడీల ఉత్పత్తిని పెంచుతుంది. దీని కారణంగా దురద, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల తీవ్రత అందరిలో ఒకేలా ఉండదు. ఒక్కోక్క వ్యక్తిలో మారుతుంటుంది. బాగా సున్నితంగా ఉండే వ్యక్తుల్లో హైవ్స్, దురద వంటివి కన్పిస్తాయి. కారణాలు : మలేరియా, టైఫాయిడ్, క్షయ, రుమాటిక్ జ్వరము, ఊపిరితిత్తులు ఇన్ పెక్షన్, జలుబు, దగ్గు, టాన్సిలైటిస్, బ్రాంకైటిస్ మూత్రనాళాల ఇన్ ఫెక్షన్ మొదలైనవాటి వల్ల కూడా హై ఫీవర్ వస్తుంది. లక్షణాలు: తలనొప్పి, చలితో కూడిన జ్వరం, కీళ్ళనొప్పులు, నోరు చేదుగా ఉండుట, అకలి తగ్గడం, మలబద్దకం, కొన్ని ప్రత్యేక సమయాలలో కలవరింతలు మొదలైనవి. జాగ్రత్తలు: జ్వరం వచ్చిన వ్యక్తి చుట్టూ తాజా వాతావరణం ఉండేలా చూడాలి. చలిజ్వరం లేకపోతే ఫ్యాన్ కింద పడుకోపెట్టవచ్చు. పలుచటి దుస్తులు వేయాలి. గోరువెచ్చని నీళ్ళతో శరీరమంతా తుడవాలి. చాలామంది చల్లనీళ్ళతో వళ్లు తుడుస్తారు. దీంతో చలివస్తుంది. కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ళు అధికంగా తాగాలి. హై జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు బయట ఎక్కువగా తిరగకుండా, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం జ్వరం ఉన్నప్పుడు శరీరానికి అధిక కేలరీలు అవసరము అవుతాయి కనుక గ్లూకోజ్, హార్లిక్స్ లాంటి ద్రవ పదార్దాలు, పండ్ల రసాలు వంటివి ఆధికంగా తీసుకోవాలి. బియ్యం గంజి,సగ్గుబియ్యం గంజి,జావ, బార్లీ నీళ్ళు సులభంగా జీర్ణమై య్యే పదార్దాలు ఇవ్వాలి. కాఫీ, టీ లాంటి ద్రవ పదార్దాలు సాధారణ వేడి తో తీసుకోవాలి. పాలు, రొట్టె లాంటి పదార్దాలు తీసుకోవచ్చును. మాంసం, గుడ్డు, వెన్న, పెరుగు, నూనె పదార్దాలు తీసుకోరాదు.