మనం తీసుకునే ఆహారంలో పోషకాలు ఎక్కువైనా.. తక్కువైనా శరీరంలోని వివిధ అవయవాల పనితీరులో మార్పు వస్తుంది. రక్తంలో కాల్షియం, ఫాస్పేటు, యూరిక్ యాసిడ్ లవణాలు అధికం కావడంతో ఏర్పడే గట్టి పదార్థాలు స్పటిక రూపంలో మారి మూత్రపిండాల పొరలలో నిల్వ ఉంటాయి. వీటినే మూత్రపిండాల్లో రాళ్లు అంటారు. జీవనశైలిలో , తీసుకునే ఆహారంలో మార్పులతో మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను నివారించవచ్చు.
సాధారణంగా మూత్రపిండాల లోపల రాళ్లు ఏర్పడతాయి. ఒకటి కన్నా ఎక్కువ రాళ్ళు కూడా ఏర్పడతాయి. మూత్రాశయం, మూత్రనాళాలలో కూడా ఈ రాళ్ళు ఏర్పడతాయి. 20-30 ఏండ్ల వయసు నుండి ఈ రాళ్ళు ఏర్పడతాయి.
ఎలా ఏర్పడతాయి
రక్తంలో కాల్షియం, ఫాస్పేటు, యూరిక్ యాసిడ్ లవణాలు అధికం కావడం వలన మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి. అధికంగా వున్న లవణాలు స్పటిక రూపంగా మూత్రపిండాల పొరలలో ఆకారాలు మారుతూ నిలువ ఉంటాయి.
కొన్ని సందర్భాలలో మూత్ర వ్యవస్ధ ఇన్ ఫెక్షన్ కారణంగా రాళ్ళు ఏర్పడతాయి.
మూత్రపిండాలు, మూత్ర నాళం, మూత్రాశయ భాగములలో ఇసుక రేణువు సైజు మొదలుకొని బత్తాయి పండు సైజు వరకు ఈ రాళ్లు ఏర్పడతాయి. యూరిక్ ఆసిడ్ పురుషులలో అధికంగా ఏర్పడతాయి.
రాళ్ళలో రకాలు
అధికశాతం కాల్షియం రాళ్ళు ఏర్పడతాయి.
కాల్షియం పదార్థాలు ఇతర ఆక్జలేట్లు ఫాస్పేట్లు, కార్బోనేట్ లవణాలతో కలిసి మూత్రపిండాల రాళ్ళుగా ఏర్పడతాయి. యునిక్ ఆసిడ్ క్రిస్టల్స్‌తో కూడా రాళ్లు ఏర్పడుతాయి.
లక్షణాలు
వీపు క్రింది భాగములో తీవ్రమైన నొప్పి మొదలై పొత్తికడుపుకు వ్యాపించి, వ షణాలు, పురుషాంగము లేక స్త్రీ జననేంద్రియం వరకు వ్యాపిస్తుంది.
వాంతి వచ్చినట్లుగా ఉండడం, వాంతులు కావడం
మూత్రపిండాలలో రాళ్ళు ఆయా భాగాలలో కదలకుండా ఉన్నంత కాలము - నొప్పికాని, బాధను కాని కలిగించవు
సైజులో ఎంత చిన్నరాయి అయినా మూత్రపిండము నుంచి మూత్రాశయము లోనికి జారుతున్నపుడు, సున్నితమైన పొర దెబ్బ తింటుంది. ఈ కారణంగా భరించలేని నొప్పి, బాధ కలుగుతుంది వణుకుతో కూడుకున్న జ్వరంతోపాటు వాంతులు ఎక్కువ సార్లు మూత్రము పోవాలనిపిస్తుంది. మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, మంట ఉంటుంది.
మూత్రం రక్తంతో కలిసి వస్తుంది.
సాధారణ కడుపు నొప్పి నుండి
భరించరాని కండరాలు వద్ద పిండినట్లుగా నొప్పి వస్తుంది.
పరీక్షలు
అల్ట్రాసౌండు - కడుపు పరీక్షలు
ఐ.వి.పి. (ఇంట్రావీనస్ ఫైలోగ్రామ్)
'ఎక్స్' రే కడుపు మూత్రనాళము - మూత్రాశయ భాగాలు , రెెగ్యులర్ సిటీ స్కాన్‌లో కెయుబి చాలా ముఖ్యమైన స్కానింగ్
మూత్ర పరీక్షలు
ఈ పరీక్షల వలన మూత్ర వ్యవస్ధ ఇన్ ఫెక్షను, మూత్రనాళాలు మూసుకుపోవడం, మూత్రపిండ కణాలు దెబ్బతినడం, మూత్ర వ్యవస్ధ పనిచేయుట వ్యత్యాసం కనుగొనవచ్చును.
మూత్రంలో పస్‌సెల్స్, ఇఫ్తనాల్ సెల్స్, బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. అల్బమిన్ కూడా కనిపిస్తుంది. మూత్రం మడ్డీగా కనిపిస్తుంది. మూత్రపరీక్షలో బ్యాక్టీరియా కూడా కనిపిస్తుంది.
చికిత్స..
పరీక్షల ద్వారా నిర్ధారించిన తర్వాత రాళ్ల సైజును బట్టి కొన్నిసార్లు మందులతో వాటిని కరిగించడం సాధ్యమవుతుంది. మూత్రపిండాలలో రాయి సైజు 5 మిమీటర్ల లోపు వుంటే సాధారణంగా మూత్రం ద్వారా బయటకు వస్తుంది
ఐదు ఎంఎం కన్నా పెద్దగా వున్న రాళ్ళు నుగా లితోట్రెప్సి ద్వారా కాని, ఆపరేషన్ ద్వారా కాని తీసివేయ వలసి వస్తుంది.
అందుబాటులోకి వచ్చిన అధునాతన పద్దతులైన యారెటరోస్మోపి, పర్ క్యూటీనియస్ నెఫ్రోలితోటమీ, అతోక్లాస్ట్, లేజర్స్ ద్వారా మూత్రపిండాల రాళ్లను తీసివేయవచ్చును.
జాగ్రత్తలు
మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడిన తర్వాత చికిత్స తీసుకోవడం తప్పనిసరి. అయితే రాళ్ళు ఏర్పడిన తర్వాతనే అనారోగ్య లక్షణాలు బయటపడతాయి. అలా కాకుండా చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే మంచిది.
మంచి నీళ్ళు అధికంగా తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా తాగితే మూత్రం పలుచబడి, ఉప్పు, ఖనిజ లవణాలు మూత్రపిండాల్లో చేరకుండా నివారించవచ్చు.
ప్రతి మనిషి రోజుకు సుమారు 3 - 4 లీటర్ల నీళ్ళు తాగాలి. ఎండలో పనిచేసేవారు ఇంకా ఎక్కువ తాగాలి. ఎండాకాలంలో అధికంగా నీళ్ళు, ద్రవపదార్థాలు తీసుకోవాలి.
పాలు, వెన్న లాంటి డైరీ ఆహార పదార్ధాలలో కాల్షియం అధిక శాతం ఉంటుంది. కాబట్టి, వీలైనంత తక్కువ మోతాదులలో తీసుకోవాలి
అవసరం లేకపోయినా కాల్షియంతో కూడిన మందుల వాడేవాళ్లు డాక్టర్ సలహా తీసుకోవాలి.
విటమిను A అధికంగా వున్న సహజమైన ఆహారాన్ని తీసుకోవాలి
శారీరకంగా చురుకుగా వుండి, రోజు సుమారు ఒక గంటలు వ్యాయామం చేయాలి. వాకింగ్, జాగింగ్, అవుట్డోర్ గేమ్స్ ఆడాలి.
మాంసక త్తులు అధికంగా వున్న మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి. యూరిక్ ఆసిడ్, కాల్షియం, ఫాస్ఫరస్ పదార్ధాలు అధికంగా ప్రోటీన్ ఆహారం ద్వారా తయారవుతాయి
విటమిన్ సి, విటమిన్ డి మాత్రలు డాక్టరు సలహా ప్రకారమే వేసుకోవాలి. వీటిని అధికంగా తీసుకోవడం వలన కాల్షియం ఆక్జలేటు రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది.
- డాక్టర్ లక్ష్మణ్ రావు
ఎం.బి.బిఎస్
మల్లునరసింహా రెడ్డి స్మారక ప్రజా వైద్యశాల
ఎం.హెచ్.భవన్, అజామాబాద్, హైదరాబాద్-
Authorization