శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. అయితే కొందరిలో ప్రతి ఐదు-పది నిమిషాలకు ఓసారి మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. ఎండలో వెళ్తున్నప్పుడో, వ్యాయామం చేసినప్పుడో, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తిన్నప్పుడో ఎక్కువగా దాహం అనిపిస్తే దానిని అంతగా పట్టించుకోవద్దు. వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు కూడా అతిగా దాహం వేస్తుంది. కానీ ఏ కారణం లేకుండా ప్రతిఐదు నిమిషాలకు ఒకసారి గొంతు తడిఆరిపోయినట్టు అనిపించడం, అదేపనిగా దాహం వేయడం అనారోగ్య సంకేతం అంటున్నారు పరిశోధకులు. ప్రత్యేకమైన కారణమేదీ లేకుండానే అతిగా దాహం వేస్తోందీ అంటే దాని వెనుక ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండవచ్చుననేది వాస్తవం. ముఖ్యంగా, మదుమేహం, గుండె, కిడ్నీలు, కాలేయాలు దెబ్బతినడం వంటి కారణాలేవో ఉండే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. కొన్నిసార్లు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అలర్జీలు, పిత్తాశయ పనితీరులో లోపాల వంటి సమస్యలు కూడా ఈ అతిదాహానికి కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. అతి దాహంతో పాటు ఎక్కువ సార్లు మూత్రం రావడం, నీరసం, కడుపునొప్పి, చూపు మసకగా అనిపించడం. తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. న