గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో కీరదోసకాయ ఒక కూల్ వెజిటేబుల్. దీన్ని రెగ్యులర్‌గా తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను అందివ్వడం మాత్రమే కాదు...చర్మానికి మంచి నిగారుపు అందిస్తుంది. దాంతో నేచురల్ గా బ్యూటిఫుల్ గా కనబడుతారు. కీరదోసకాయలో, విటమిన్స్, మినిరల్స్, వాటర్ కంటెంట్ అధికం. ఇందులో ఉండే ప్రతి విటమిన్, మినిరల్ చర్మానికి చాలా ఎఫెెక్టివ్గా పనిచేస్తాయని నిరూపించబడ్డాయి.
చర్మానికి వారంలో రెండు సార్లు కీరదోసకాయతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మరంధ్రాల లోపల నుండి శుభ్రపడి చర్మం రంగును మరింత బ్రైట్‌గా మార్చడంలో కీరదోసకాయ సహాయపడుతుంది. ఇది చర్మాన్ని టైట్ చేస్తుంది. రెగ్యులర్‌గా కీరదోసకాయతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మసంరక్షణ, ఎఫెక్టివ్ ఫలితాలను పొందాలంటే వారంలో రెండు మూడు సార్లు కీరదోసకాయతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.
కీరకాయతో ప్రయోజనాలు..
ఈ కుకుంబర్తో ఫేస్ ప్యాక్ వేసుకొన్న తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మం సాప్ట్‌గా, కాంతివంతంగా, తేమగా మార్చుకోవడానికి ఈ ప్యాక్ ఎంతో సహాయపడుతుంది. ఈ ప్యాక్ వేసుకొన్న తర్వాత చల్లటి రోజ్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. రోజ్ వాటర్లోఉండే లక్షణాలు చర్మం ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతాయి. చర్మం నేచురల్‌గా అందంగా కనబడుతుంది.
ఆయిల్ స్కిన్ నివారించడానికి ..
చాలామందిలో ఆయిల్స్కిన్ పెద్ద సమస్యగా ఉంటుంది. దీన్ని నివారించాలంటే కొన్ని రకాల ఫేస్‌ప్యాక్‌లు ఇంట్లోనే తయారుచేసుకోవాలి.
జాగ్రత్తలు తప్పనిసరి..
కావల్సిన పదార్థాలు:
కీరదోసకాయ: చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
పెరుగు : నాలుగు టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం:
కీరదోసకాయను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దానికి పెరుగును చేసి బాగా మిక్స్ చేయాలి.
అప్లై చేయడం ఎలా:
మొదట ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కీరదోసకాయ పెరుగు మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ముఖానికి అప్లై చేసేప్పుడు ఈ పేస్ట్ మరింత చిక్కగా ఉండాలి.
జాగ్రత్తలు..
ఈ ప్యాక్ బాగా డ్రైగా మారాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత చేతి వేళ్ళతో ప్యాక్ ను సున్నితంగా తొలగించాలి. తర్వాత రోజ్ వాటర్, ఐస్ క్యూబ్స్ తో ముఖాన్ని శుభ్రం చేయడంవల్ల ముఖానికి పర్ఫెక్ట్ గ్లో వస్తుంది.
డ్రై స్కిన్ వారికి..
కీరదోసకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ ప్యాక్ ను ముఖానికి ఉపయోగించినప్పుడు, ఇది డ్రై అండ్ దురద పెట్టే చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. కీరదోసకాయలో ఉండే వాటర్ చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దాంతో చర్మం సహజంగానే కాంతివంతంగా మెరుస్తుంటుంది.
ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:
కీరదోసకాయలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది చాలా పవర్ ఫుల్ విటమిన్. ఈ పవర్ ఫుల్ విటమిన్ అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అనేక రకాల ఇన్ఫ్లమేటరీ డిసీజ్లను నివారిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల బెటర్ స్కిస్ సెల్స్ ఏర్పడుతాయి.
ఏజింగ్ స్కిన్ దూరం అవుతుంది:
కీరదోసకాయతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి. కీరదోసకాయలో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది . చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి ఏజింగ్ స్కిన్ సెల్స్‌ను దూరం చేస్తుంది.
ఇన్ఫ్లమేటెడ్ స్కిన్:
కీరదోసకాయలో బయోటిన్ అధికంగా ఉండటం వల్ల ఇది స్కిన్ రాషెష్ను మాయం చేస్తుంది. మరో స్కిన్ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్, స్కిన్ రాషెష్, వంటి సమస్యలను నివారిస్తుంది.
Authorization