ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం, ఎక్కువ సేపు కూర్చుని ఉండడం, జీవనశైలిలో మార్పులతో వచ్చే మలబద్దకం, థైరాయిడ్, డయాబెటిస్ వంటి వ్యాధులు ఇలా అనేక కారణాల వల్ల పైల్స్ సమస్య వస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారి అవస్థను మాటల్లో చెప్పలేం. అయితే పైల్స్ బాధ నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. - కలబంద (అలోవెరా) గుజ్జును పైల్స్‌పై అప్లై చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది. - ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని బిర్యానీ ఆకులు (బే లీవ్స్), మూడు వెల్లుల్లి రెక్కలు వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత చల్లారిన మిశ్రమాన్ని పైల్స్ పై రాయాలి. రోజుకు మూడు సార్లు ఇలా చేస్తే పైల్స్ బాధ తగ్గుతుంది. - ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి అందులో కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని పైల్స్‌పై రాయాలి. దీంతో వాటి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. - కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను ఒక గిన్నెలో తీసుకుని అందులో కాటన్ బాల్స్ ముంచి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో పైల్స్ బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆలివ్ ఆయిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నందున ఇది పైల్స్‌కు తక్షణ ఉపశమనంగా పనిచేస్తుంది. - ఆముదం, బాదం నూనె మిశ్రమాన్ని పైల్స్‌పై రాస్తే కొద్ది రోజుల్లోనే పైల్స్ తగ్గిపోతాయి.