ప్రస్తుతం ఇంటి నుంచి కాలు బయట పెడితే బైక్ లేదా కారు ఉపయోగిస్తున్నారు. దీంతో ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. ప్రతిరోజు వ్యాయామం చేయాలని ఉన్నా సరైన సమయం, ప్రదేశం లేదని వాయిదా వేసేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారు రోజు కనీసం 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటో సైకిల్ తొక్కడం వల్ల శరీరం మొత్తం కదులుతుంది. శరీరంలోని అన్ని భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరగడంలో సైకిలింగ్ ఉపయోగపడుతుంది. అధిక బరువు తగ్గుతారు. డయాబెటిస్ పేషెంట్లు సైక్లింగ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. రోజువారీ 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే 60 శాతం వరకు మధుమేహం తగ్గే అవకాశాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సైక్లింగ్ ద్వారా హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులను రాకుండా చేస్తుంది. - సైకిలింగ్ వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. సైకిల్ తొక్కుతున్నప్పు శ్వాస తీసుకోవడం, వదలడం వేగంగా చేస్తాము. కాబట్టి శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. కీళ్ల నొప్పులతో ఉన్న వాళ్లు సైక్లింగ్ అలవాటు చేసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. సైక్లింగ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగు తుంది. దీనితో పాటు డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.