అన్నకోశం 'జె' ఇంగ్లీష్ అక్షరం ఆకారంలో వుంటుంది. మనం తిన్న ఆహారం అన్నవాహిక ద్వారా ఈ సంచిలోకి చేరుతుంది. ఈ అన్నకోశం ఎక్కువభాగం పొట్టలో ఎడమవైపు వుంటుంది. అన్నకోశం గోడల్లో నాలుగు పొరలు వుంటాయి. లోపలి పొర జిగురుపొర. ఈ పొరలో వుండే గ్రంధుల్లో జీర్ణరసం ''పెప్సిన్'' హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతాయి. తిన్న ఆహారాన్ని అన్నకోశం మరొక పొరలో వుండే కండరాలు సంకోచించి ఆహారాన్ని మెత్తగా రుబ్బి జీర్ణరసాయనాలతో కలుపుతాయి. ఈ దశలో ఆహారాన్ని 'కైమ్' అంటారు. 'కైమ్'గా మారిన ఆహారం అన్నకోశం దాటి చిన్న ప్రేగులోనికి పోతుంది.
అన్నకోశం అనేక వ్యాధులకు గురవుతూ వుంటుంది. ఎసిడిటి, గ్యాస్, గ్యాస్ట్రయిటిస్, అల్సర్, క్యాన్సర్ లాంటి వ్యాధులు. ఎసిడిటి బాధను తట్టుకోవడానికి నేడు ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మందులను వాడుకోవడం జరుగుతుంది. పెప్టిక్ అల్సర్లలో నూటికి అరవై డుయోడినంలో ఏర్పడితే నలభై అన్నకోశంలో ఏర్పడతాయి. వీటినే డుయోడినల్, గ్యాస్ట్రిక్ అల్సర్లు అంటారు. ఈ అల్సర్లు నూటికి 80 మంది పురుషులలో, నూటికి 20 మంది స్ల్రీలలోను కనిపిస్తాయి. '0' గ్రూపు రక్తం కలవారిలో ఈ వ్యాధి రావడం ఎక్కువగా వుంటుందని గమనించారు.
కారణాలు :ఈ రోజుల్లో 17ఏండ్లవారి నుంచే ఈ వ్యాధిని చూస్తున్నాం. యాసిడ్ ఎక్కువగా వున్నవారిలో ఈ వ్యాధి వస్తుందని అభిప్రాయపడుతారు. కాని యాసిడ్ ఎక్కువగా వున్నవారిలో కాకుండా తక్కువగా వున్నవారిలో కూడా ఈ వ్యాధి కనిపించడం విచిత్రమైన విషయం. యాసిడ్ ఉత్పత్తి మామూలుగా వున్నా జిగురు పొరలను కాపాడే తగ్గిపోయినట్లయితే అల్సరు రావచ్చు. ఇందుకు ప్రధాన కారణం జీవన సరళి, మానసిక ఒత్తిడి, యాస్పిరిన్, ఇతర చీూA×ణ వాడడం మూలంగా ఈ వ్యాధికి గురవుతారు. ధూమపానం (పొగత్రాగడం) పొగాకు వాడకం, మసాలాలు, కారం అల్సర్‌కి కారణం కాకపోయినా వీటి వల్ల అల్సర్ వున్నవారిలో బాధలు ఎక్కువ అవుతాయి.
వ్యాధి లక్షణాలు : వ్యాధి ముఖ్యలక్షణాలలో నొప్పి ఒకటి. నొప్పి కొరుక్కుతిన్నట్లుగా గాని, మంటబెట్టినట్టుగా గాని వుంటుంది. అల్సర్ వున్న ప్రదేశంను బట్టి అల్సర్ నొప్పి ఆధారపడి వుంటుంది. డుయెడినల్ అల్సర్ ద్వారా వచ్చే నొప్పి ఆహారం తీసుకున్న 2,3 గంటల తరువాత వస్తుంది. మళ్లీ ఏదైనా తింటే తగ్గిపోతుంది.
గ్యాస్ట్రిక్ అల్సర్ ద్వారా వచ్చే నొప్పి తింటే ఎక్కువ అవుతుంది. అల్సర్ వ్యాధితో బాఢపడే రోగుల్లో నూటికి యాభై మందిలో ఏ బాధలు వుండకపోవచ్చు. వారికి అసలు అల్సర్ వున్నదని తెలియకపోవచ్చు. రక్తస్రావం లాంటి కాంప్లికేషన్ వచ్చినప్పుడు వారికి అల్సర్ వున్నట్లు బయటపడుతుంది.
వ్యాధి నివారణకు వ్యాధి మాత్రమే కాకుండా వ్యాధిగ్రస్తుని లక్షణాలు అవసరమన్న హోమియో సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోవడానికి ఈ వ్యాధి లక్షణాలే గొప్ప నిదర్శనం.
You wont get ulecs by what you eat. You get ulcer by what is eating you is important in Homeopathy
పొట్ట ఉబ్బరం, వికారం, వాంతులు, పెప్టిక్ అల్సర్ వ్యాధి లక్షణాల జాబితాలో మరికొన్ని లక్షణాలు.
పెప్టిక్ అల్సర్ వల్ల వచ్చే సమస్యలు :
- అల్సర్ నుండి రక్తస్రావం
- అల్సర్ వల్ల ప్రేగు ముడుచుకొనిపోయి ఆహారం పోకుండా అవరోధంగా వుండడం
- అల్సర్ వల్ల ప్రేగు రంద్రంపడడం, ఈ విధంగా జరిగితే వెంటనే ఆపరేషన్ చేయవలసి వుంటుంది.
- అల్సర్ క్యాన్సర్‌గా మారడం.
ఆహారం - అలవాట్లు : అల్సర్ వున్న రోగులు ఎక్కువగా పాలు తాగడం మంచిది. ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకుంటే మంచిది. మసాలాలు, కారం, కొవ్వు పదార్ధాలు, పండ్లరసం లాంటివి. అల్సర్ లక్షణాలను ఉద్రేకపరిచేవి. కనుక వాటిని అల్సర్ రోగులు మానివేయడం మంచిది.
పొగత్రాగడం, ఆల్కహాల్, పాన్, గుట్కాలు మానివేయాలి. మానసికమైన వత్తిళ్ళు, ఉద్రేకాలకు దూరంగా వుండాలి.
పెప్టిక్ అల్సర్ రోగుల ఔషదాలు
- ఎనాకార్డియం : తెరలు తెరలుగా పొట్టనొప్పి తిన్న తరువాత రెండుగంటల వరకు ఉపశమనం వుంటుంది. పొట్ట ఖాళీగా వున్నప్పుడు తేలిపోతున్నట్టు వుంటుంది. అంటే హాయి వుంటుంది.
- ఫాస్పరస్ : తీవ్రంగా నొప్పి, పసరు వాంతులు, తరువాత రక్తం కూడ పడవచ్చు. కొరుక్కు తిన్నట్టు నొప్పి, ఆహారం తిన్న వెంటనే వాంతి అవుతుంది. ఇమడదు. చల్లటి పానీయాలు అంటే ఇష్టం. ఐస్‌క్రీం, ఐస్నీళ్ళు తాగితే బాధ తగ్గుతుంది. వేడిపాలు, కాపీ, టీలు ఇష్టపడరు. శారీరక, మానసికంగా అలసట. నీరసం, ఒంటరిగా వుండలేరు. చీకటి, ఉరుములు అంటే భయం. నీరు తాగిన కొద్దిసేపటి తరువాత వాంతి అవుతుంది.
- కార్భోవెజ్ : పొట్టలో మంట, పొట్ట ఉబ్బరం, తేెన్పులు, గ్యాస్, దుర్గందంతో కూడిన ఆపానవాయువులు. పచ్చళ్ళు, తీపి పదార్ధాలు చాలా ఇష్టం. పిండి వంటలు ఎక్కువ తీసుకుంటారు. అజీర్తితో బాధపడతారు. మధ్యం అలవాటు వుంటుంది. పొట్టలో మెలిపెట్టినట్టు నొప్పి, మంట, శరీరం మీద చల్ల చెమటలు వస్తాయి.
- గ్రాఫయిటిస్ : ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. పొట్ట ఖాళీగా వుంటే పీకుతున్నట్టు నొప్పి తింటే తగ్గుతుంది. వేడి పదార్ధాలు తీసుకున్నా, పడుకున్నా నొప్పి తగ్గుతుంది. చాతిలో మంట, పుల్లటి తేపులు, ఎప్పుడూ దిగులుగా వుంటారు. ఎప్పుడూ ప్రతిపనిలో సంశయం, స్థిరంగా గుండె నిబ్బరంగా వుండలేరు.
- చెలిడోనియం : పొట్టలో విపరీతమైన బాధ, తిన్న తరువాత బాధ తగ్గుతుంది. తేపు వచ్చినా ఉపశాంతి వుంటుంది. వేడిపాలు తాగితే బాధ తగ్గుతుంది. వికారం ఎక్కువ ఆల్కహాల్‌ను ఇష్టపడతారు.
- అర్జెంటం నైట్రికం : ధైర్యం చేసి నిర్ణయం తీసుకోలేరు. పిరికితనం ఎక్కువ. పొట్టలో నొప్పి, తిన్న తరువాత కారం చల్లినంత బాధ. పొట్ట ఎడమవైపు పై భాగంలో నొప్పి అర్ధరాత్రి బాధలు ఎక్కువ అవుతాయి. జిగురు పదార్ధం వాంతులు అవుతాయి. తినగానే నొప్పి మొదలవుతుంది. వాంతయ్యే వరకు నొప్పి తగ్గదు. పంచదార, ఉప్పు చాలా ఇష్టపడతారు. పరీక్షల ముందు భయం. ఎప్పడయినా పని మీద బయటకి వెళ్ళాలనుకోగానే విరేచనం వచ్చినట్లు వుండి చాలా ఇబ్బంది పడుతారు.