- తలకింద దిండు పెట్టుకుని నిద్రించే అలవాటు చాలామందికి ఉంటుంది. మరికొందరైతే దిండు లేకపోతే మెడ నొప్పి వస్తుందని, అసౌకర్యంగా ఉంటుందంటారు. అయితే నిజానికి తలకింద దిండు లేకుండా నిద్రిస్తే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వాళ్లు ఇలా వివరిస్తున్నారు. - తలకింద దిండు లేకుండా నిద్రిస్తే ముఖంపై ఉన్న ముడతలు, మచ్చలు పోతాయి. దిండు పైన పడుకున్నప్పుడు దిండుకు ఉన్న బ్యాక్టీరియా మన ముఖానికి అతుక్కుని ముడతలు ఏర్పడుతాయి. కాబట్టి దిండు లేకుండా నిద్రిస్తే బ్యాక్టీరియా చేరే అవకాశం ఉండదు. దీంతో మచ్చలు, ముడతలు రావట. - వెన్నునొప్పి ఉన్న వారు తలకింద దిండు లేకుండా చేసుకుంటే మంచిదట. దీంతో వెన్నెముకకు విశ్రాంతి లభిస్తుంది. అది తన సహజసిద్థమైన షేప్‌లోకి వస్తుందట. ఈ క్రమంలో వెన్నెనొప్పి సమస్య నుంచి బయట పడవచ్చు. దిండు లేకుండా నిద్రిస్తేనే నిద్ర చాలా బాగా పడుతుందట. దీంతో వల్ల నిద్రలేమి సమస్యలు దూరమవు తాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. మానసిక ఆందోళన తగ్గి.. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మెడ, భుజాల నొప్పులు తగ్గుతాయని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.