ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు అధికంగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉంటే గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుందని వైద్య పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఆహారంలో కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని పోషకాహారనిపుణులు సూచిస్తున్నారు. చెడు కొలెస్ట్రాలను తొలగించేందుకు ఆహారంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు.. మొలకెత్తిన గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి.ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో బాగా పని చేస్తాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి ఒత్తిడి తగ్గించి, గుండె పని విధానాన్ని మెరుగుపర్చుతాయి. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే దీంట్లో ఉండే ప్రోటీన్లు గుండె కండరాలను దృఢంగా తయారు చేస్తాయి. గుండెకు అవసరమైన పోషకాలు ఓట్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీంట్లో ఉండే ఫైబర్, ఆమ్లాలు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. కాబట్టి రాత్రి సమయంలో ఓట్స్ తీసుకోవడం మంచిది. రాత్రి సమయంలో వేడిగా ఉండే సూప్స్‌ను తీసుకోవడం మంచిది. బీన్స్, క్యారెట్స్, ఆకుకూరలతో తయారు చేసినా సూప్స్ తాగడం వల్ల గుండె బలంగా తయారవుతుంది. ఆరోగ్యకరమైన గుండె కోసం తీసుకోవలసిన ఆహార పదార్థాలను ఆరోగ్యనిపుణులు ఇలా సూచిస్తున్నారు. గోధుమలు, రాగులు, సద్దలు, జొన్నలు, పప్పులు, మొలకెత్తిన పప్పుదినుసులు, తక్కువ కొవ్వు కలిగిన పాలు, మజ్జిగ, కోడిగ్రుడ్డు లోని తెల్లసొన, చేపలు, తాజా పండ్ల రసాలు, తక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవాలి. నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు తప్పని సరిగా చేయాలి.