శరీరంలోని మంచి రక్తం ధమనుల్లో, చెడు రక్తం సిరల్లో ప్రవహిస్తుంటుందన్న విషయం అందిరికీ తెలిసిందే.. రక్తాన్ని ఒకే వైపునకు ప్రవహింపజేస్తూ... వెనక్కు రాకుండా చూసే కవాటాలు ఉంటాయి. కొన్నిసార్లు ఈ కవాటాలు(వాల్వ్స్) బలహీనపడటం వల్ల రక్తం మునుపటిలా ప్రవహించక సిరల్లో పోగుపడుతుంది. దాంతో చాలా సందర్భాల్లో కాళ్లపై సిరలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. వీటినే వెరికోజ్ వీన్స్ అని పిలుస్తారు. ఇవి ఏర్పాడానికి ప్రధాన కారణం కాలి సిరల్లోని కవాటాల సామర్థ్యం తగ్గటం. దీంతో రక్తం పైకి చేరుకోకుండా కిందికి జారిపోతూ.. అక్కడే ఎక్కువగా నిల్వ ఉంటుంది. దాంతో రక్తనాళాలు ఉబ్బిపోయి.. పైకి మెలికలు తిరిగినట్టుగా కనబడుతాయి. ఇది ప్రమాదకరమైందేమీ కాకపోయినా సమస్యను గుర్తించి, చికిత్స తీసుకోవడం అవసరం.
మాములుగా సిరలు కంటికి కనిపించవు. ఇవి వాచినప్పుడు మాత్రమే చర్మం పైకి కనిపిస్తాయి. వీటిలో ఉంటే కవాటం సరిగ్గా పనిచేయనందున గుండెకు చేరాల్సిన రక్తం కిందికి ప్రవహించి వెరికోజ్ వీన్స్గా మారుతాయి. సమస్య తీవ్రమైతే నొప్పి, వాపు, చర్మం రంగు మారటం, పుండ్లు పడటం వంటివి తలెత్తుతాయి. వీటివలన కొన్నిసార్లు ప్రమాదానికి గురికావచ్చు. రక్తం గడ్డకట్టడం వలన ఆ రక్తం గుండెవైపు ప్రయాణం చేసి ఊపిరితిత్తులలో థ్రాంబోస్గా మారితే రోగి చనిపోయే ప్రమాదం ఉంది.
కారణాలు..
వెరికోజ్ వీన్స్ ఎందుకు వస్తాయి అన్నదానికి ప్రత్యేకమైన కారణాలు ఇంతవరకు నిపుణులకే అంతుచిక్కలేదు.
రక్తం ఒకే దిశలో ప్రవహించే విధంగా సిరల్లో కవాటాలు ఉంటాయి. ఇవి గుండె వైపు ప్రవహించే రక్తం కిందికి ప్రవహించకుండా నివారిస్తాయి. ఈ కవాటాల సామర్ధ్యం తగ్గినప్పుడు రక్తం శరీరం కిందిభాగం వైపు ప్రవహిస్తుంది. దాంతో కాళ్లల్లో ఉండే సిరల్లో రక్తం పెరిగి సిరలు పెద్దవిగా కావడంతో పాటు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. కడుపు మీద ఒత్తిడి పెరిగినప్పుడు ముఖ్యంగా గర్భిణీల్లో, పొట్టభాగంలో అధికంగా కొవ్వు పెరుకుపోయిన వారిలో, మలబద్ధకం సమస్యతో బాధపడేవారిలో ఈ కవాటాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎక్కువ సమయం నిలబడి ఉండేవారిలో, కూర్చుండే ఉద్యోగాలు చేసేవారిలోనూ ఈ సమస్య రావచ్చు. కొన్నిసార్లు హెరిడిటీగా కూడా ఇవి వస్తాయి. హార్మోన్ స్థాయిల్లోనూ వచ్చే హెచ్చుతగ్గులు కూడా వెరికోజ్ వీన్స్కు కారణం అవుతాయి.
లక్షణాలు..
కాలి పిక్కల నుంచి పాదాల వరకు రక్తనాళాలు ఉబ్బి చర్మం పైకి కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు రంగు మారుతాయి. ఎక్కువగా బాధ అనిపించకపోయినా.. వయసు పెరిగే కొద్ది ఇబ్బందిగా మారుతాయి.
రాత్రివేళ కాళ్లు నొప్పిగా ఉంటాయి.
కాలిభాగంలో చిన్నగాయమైనా ఎక్కువగా రక్తస్రావం అవుతుంది.
సిరలు పైకి ఉబ్బి ఉండటంతో చర్మంపై దురదగా ఉంటుంది.
కొందరిలో కాళ్లల్లో తిమ్మిర్లు వస్తాయి.
పరీక్షలు..
సిరల్లో కవాటాలు ఎంత మేరకు దెబ్బతిన్నాయో తెలుసుకోవడానికి కొన్ని వైద్యపరీక్షలు చేస్తారు.
సిరల వాపును కలర్ డాప్లర్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. ఇది చాలా తేలికైన, సులువైన పరీక్ష. అయితే దీన్ని నిలబడినప్పుడు, కూచున్నప్పుడే చేయాలి. పడుకున్నప్పుడు చేయకూడదు. సిరల్లో రక్త ప్రవాహం దిశను గమనించడానికి చేసే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్. ఈ పరీక్ష సిరల్లో రక్తం గడ్డకట్టడం లేదా అడ్డంకులకు కూడా తెలియజేస్తుంది. ఇది సిరల నిర్మాణం చిత్రాలతో పాటు రక్త ప్రసరణ వేగాన్ని కూడా తెలియజేస్తుంది.
చికిత్స..
కొన్ని రకాల మందులు వేసుకుంటే సరిపోతుంది. వీటితో ఫలితం కనబడకపోతే.. చర్మం రంగు మారటం, పుండు పడటం వంటివి ఉంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో రేడియేషన్ కిరణాలను ఉపయోగించి ఇలా వాల్వ్స్ దెబ్బతిన్న రక్తనాళాల్లోకి ట్యూబ్లను పంపి, వాటి ద్వారా లేజర్ కిరణాలను పంపి చికిత్స చేస్తారు. ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ఇంటర్వెన్షనల్ ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ లేదా స్క్లీరోథెరపీ అంటారు. దాంతో కవాటాలు బలహీనపడ్డ రక్తనాళాలు శాశ్వతంగా మూసుకుపోతాయి. ఆరోగ్యకరమైన ఇతర సిరలు సమర్ధవంతంగా పని చేస్తాయి. ఫలితంగా రక్తప్రవాహం మునుపటిలాగే జరుగుతుంది. సిరలు ఉబ్బి కనిపించడం, నొప్పులు రావడం తగ్గుతాయి. ఇలాంటి చికిత్సలు చేయటం కుదరని వారికి చర్మానికి కోత పెట్టి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఇందులో సమస్య ఉన్న సిరను పై నుంచి కింది వరకూ తొలగిస్తారు.
జాగ్రత్తలు..
కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
వెరికోజ్ వీన్స్ సమస్య ఉన్నవారు నిత్యం వాకింగ్ చేయాలి. గంటల తరబడి కూర్చుని ఉండకుండా చూసుకోవాలి. అలా కూర్చోవాల్సి వస్తే మధ్య మధ్యలో లేచి కొంత సేపు నడుస్తుండాలి.
కాళ్లు నొప్పిగా ఉంటే మసాజ్ ఆయిల్స్ తో కాళ్లను, పాదాలను మర్దనా చేయాలి. అధికంగా ఒత్తిడి పడకుండా సున్నితంగా మర్దనా చేయాలి.
నిద్రించే సమయంలో గుండెకు రక్త సరఫరా పెరిగేందుకు కాళ్లను పైకి ఉంచాలి.
రక్త సరఫరా మెరుగ్గా ఉండేందుకు వదులైన దుస్తులను ధరించాలి. బిగుతుగా ఉన్న దుస్తులను వేసుకోవద్దు.
ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండే ఉల్లిపాయలు, క్యాప్సికం, పాలకూర, ద్రాక్షలు, చెర్రీలు, యాపిల్స్, బ్లూబెర్రీలు, వెల్లుల్లి తదితర ఆహారాలను నిత్యం తీసుకోవాలి.
పొటాషియం ఎక్కువగా ఉండే బాదం పప్పు, పిస్తాలు, పప్పు దినుసులు, ఆలుగడ్డలు, ఆకుపచ్చని కూరగాయలు, చేపలు, ఫైబర్ ఎక్కువగా ఉండే నట్స్, త ణ ధాన్యాలు నిత్యం తీసుకుంటే వెరికోజ్ వీన్స్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెరికోజ్ వీన్స్ గలవారు కాళ్లకు బిగుతైన మేజోళ్లు ధరిస్తే కొంత ఉపశమనం ఉంటుంది. ఇవి కాళ్లను గట్టిగా చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
నివారణ
వెరికోజ్వీస్స్ సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
తప్పనిసరిగా వాకింగ్ చేయాలి
అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి.
ఎక్కువ సేపు ఒకేచోట కదలకుండా నిలబడవద్దు. కనీసం ప్రతి అరగంటకు ఒకసారి అటూఇటూ తిరగాలి. మాములుగా సిరలు కంటికి కనిపించవు. ఇవి వాచినప్పుడు మాత్రమే చర్మం పైకి కనిపిస్తాయి. వీటిలో ఉంటే కవాటం సరిగ్గా పనిచేయనందున గుండెకు చేరాల్సిన రక్తం కిందికి ప్రవహించి వెరికోజ్ వీన్స్గా మారుతాయి. సమస్య తీవ్రమైతే నొప్పి, వాపు, చర్మం రంగు మారటం, పుండ్లు పడటం వంటివి తలెత్తుతాయి. వీటివలన కొన్నిసార్లు ప్రమాదానికి గురికావచ్చు. రక్తం గడ్డకట్టడం వలన ఆ రక్తం గుండెవైపు ప్రయాణం చేసి ఊపిరితిత్తులలో థ్రాంబోస్గా మారితే రోగి చనిపోయే ప్రమాదం ఉంది.
కారణాలు..
వెరికోజ్ వీన్స్ ఎందుకు వస్తాయి అన్నదానికి ప్రత్యేకమైన కారణాలు ఇంతవరకు నిపుణులకే అంతుచిక్కలేదు.
రక్తం ఒకే దిశలో ప్రవహించే విధంగా సిరల్లో కవాటాలు ఉంటాయి. ఇవి గుండె వైపు ప్రవహించే రక్తం కిందికి ప్రవహించకుండా నివారిస్తాయి. ఈ కవాటాల సామర్ధ్యం తగ్గినప్పుడు రక్తం శరీరం కిందిభాగం వైపు ప్రవహిస్తుంది. దాంతో కాళ్లల్లో ఉండే సిరల్లో రక్తం పెరిగి సిరలు పెద్దవిగా కావడంతో పాటు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. కడుపు మీద ఒత్తిడి పెరిగినప్పుడు ముఖ్యంగా గర్భిణీల్లో, పొట్టభాగంలో అధికంగా కొవ్వు పెరుకుపోయిన వారిలో, మలబద్ధకం సమస్యతో బాధపడేవారిలో ఈ కవాటాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎక్కువ సమయం నిలబడి ఉండేవారిలో, కూర్చుండే ఉద్యోగాలు చేసేవారిలోనూ ఈ సమస్య రావచ్చు. కొన్నిసార్లు హెరిడిటీగా కూడా ఇవి వస్తాయి. హార్మోన్ స్థాయిల్లోనూ వచ్చే హెచ్చుతగ్గులు కూడా వెరికోజ్ వీన్స్కు కారణం అవుతాయి.
లక్షణాలు..
కాలి పిక్కల నుంచి పాదాల వరకు రక్తనాళాలు ఉబ్బి చర్మం పైకి కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు రంగు మారుతాయి. ఎక్కువగా బాధ అనిపించకపోయినా.. వయసు పెరిగే కొద్ది ఇబ్బందిగా మారుతాయి.
రాత్రివేళ కాళ్లు నొప్పిగా ఉంటాయి.
కాలిభాగంలో చిన్నగాయమైనా ఎక్కువగా రక్తస్రావం అవుతుంది.
సిరలు పైకి ఉబ్బి ఉండటంతో చర్మంపై దురదగా ఉంటుంది.
కొందరిలో కాళ్లల్లో తిమ్మిర్లు వస్తాయి.
పరీక్షలు..
సిరల్లో కవాటాలు ఎంత మేరకు దెబ్బతిన్నాయో తెలుసుకోవడానికి కొన్ని వైద్యపరీక్షలు చేస్తారు.
సిరల వాపును కలర్ డాప్లర్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. ఇది చాలా తేలికైన, సులువైన పరీక్ష. అయితే దీన్ని నిలబడినప్పుడు, కూచున్నప్పుడే చేయాలి. పడుకున్నప్పుడు చేయకూడదు. సిరల్లో రక్త ప్రవాహం దిశను గమనించడానికి చేసే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్. ఈ పరీక్ష సిరల్లో రక్తం గడ్డకట్టడం లేదా అడ్డంకులకు కూడా తెలియజేస్తుంది. ఇది సిరల నిర్మాణం చిత్రాలతో పాటు రక్త ప్రసరణ వేగాన్ని కూడా తెలియజేస్తుంది.
చికిత్స..
కొన్ని రకాల మందులు వేసుకుంటే సరిపోతుంది. వీటితో ఫలితం కనబడకపోతే.. చర్మం రంగు మారటం, పుండు పడటం వంటివి ఉంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో రేడియేషన్ కిరణాలను ఉపయోగించి ఇలా వాల్వ్స్ దెబ్బతిన్న రక్తనాళాల్లోకి ట్యూబ్లను పంపి, వాటి ద్వారా లేజర్ కిరణాలను పంపి చికిత్స చేస్తారు. ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ఇంటర్వెన్షనల్ ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ లేదా స్క్లీరోథెరపీ అంటారు. దాంతో కవాటాలు బలహీనపడ్డ రక్తనాళాలు శాశ్వతంగా మూసుకుపోతాయి. ఆరోగ్యకరమైన ఇతర సిరలు సమర్ధవంతంగా పని చేస్తాయి. ఫలితంగా రక్తప్రవాహం మునుపటిలాగే జరుగుతుంది. సిరలు ఉబ్బి కనిపించడం, నొప్పులు రావడం తగ్గుతాయి. ఇలాంటి చికిత్సలు చేయటం కుదరని వారికి చర్మానికి కోత పెట్టి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఇందులో సమస్య ఉన్న సిరను పై నుంచి కింది వరకూ తొలగిస్తారు.
జాగ్రత్తలు..
కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
వెరికోజ్ వీన్స్ సమస్య ఉన్నవారు నిత్యం వాకింగ్ చేయాలి. గంటల తరబడి కూర్చుని ఉండకుండా చూసుకోవాలి. అలా కూర్చోవాల్సి వస్తే మధ్య మధ్యలో లేచి కొంత సేపు నడుస్తుండాలి.
కాళ్లు నొప్పిగా ఉంటే మసాజ్ ఆయిల్స్ తో కాళ్లను, పాదాలను మర్దనా చేయాలి. అధికంగా ఒత్తిడి పడకుండా సున్నితంగా మర్దనా చేయాలి.
నిద్రించే సమయంలో గుండెకు రక్త సరఫరా పెరిగేందుకు కాళ్లను పైకి ఉంచాలి.
రక్త సరఫరా మెరుగ్గా ఉండేందుకు వదులైన దుస్తులను ధరించాలి. బిగుతుగా ఉన్న దుస్తులను వేసుకోవద్దు.
ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండే ఉల్లిపాయలు, క్యాప్సికం, పాలకూర, ద్రాక్షలు, చెర్రీలు, యాపిల్స్, బ్లూబెర్రీలు, వెల్లుల్లి తదితర ఆహారాలను నిత్యం తీసుకోవాలి.
పొటాషియం ఎక్కువగా ఉండే బాదం పప్పు, పిస్తాలు, పప్పు దినుసులు, ఆలుగడ్డలు, ఆకుపచ్చని కూరగాయలు, చేపలు, ఫైబర్ ఎక్కువగా ఉండే నట్స్, త ణ ధాన్యాలు నిత్యం తీసుకుంటే వెరికోజ్ వీన్స్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెరికోజ్ వీన్స్ గలవారు కాళ్లకు బిగుతైన మేజోళ్లు ధరిస్తే కొంత ఉపశమనం ఉంటుంది. ఇవి కాళ్లను గట్టిగా చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
నివారణ
వెరికోజ్వీస్స్ సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
తప్పనిసరిగా వాకింగ్ చేయాలి
అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి.
ఎక్కువ సేపు ఒకేచోట కదలకుండా నిలబడవద్దు. కనీసం ప్రతి అరగంటకు ఒకసారి అటూఇటూ తిరగాలి.
Authorization