ఎండాకాలంలో రోజూ గ్లాస్ నిమ్మరసం తగితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇది ఆకలిని పెంచి శక్తినిస్తుంది. ఇందులో అధికంగా ఉండే విటమిన్-సి రోగ నిరోధకశక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. నిమ్మరసం తాగాలని చెబుతారు. నిమ్మరసం తాగడం వల్ల లాభాలు తెలుసుకుంటే తప్పక రోజూ నిమ్మరసం తాగుతారు. నిమ్మలో అనేక రకాల విటమిన్లు ఉన్నాయి. 100గ్రాముల నిమ్మరసంలో క్యాల్షియం 10.7మి.గ్రా, పొటాషియం 16.3మి.గ్రా, సోడియం 6.5మి.గ్రా ఉంటుంది. విటమిన్-సి 63మి.గ్రా, సీయోసిన్ 0.2, క్లోరిన్ 51, ఫోలిక్ యాసిడ్ 7 మి.గ్రా, పిండి పదార్థాలు 9, మాంసకృత్తులు 1.5 మి.గ్రాలతోపాటు విటమిన్-డి, బి-6 కూడా లభిస్తోంది. పోషక విలువల్లో చూస్తే 20కిలో కేలరీలు, పిండి పదార్థాలు 9గ్రాములు, చక్కెర 1.5 గ్రా, పీచు పదార్థాలు 2.8గ్రాములు ఉంటాయి. ఉపయోగాలు నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే కడుపు, పేగులు శుభ్ర పడి మలబద్దకం సమస్య తొలిగిపోతుంది. ఎండాలో తిరిగే వాళ్లు నిమ్మరసంలో కాస్త ఉప్పు, చక్కెర కలిపి తాగితే వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. నిమ్మరసం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి. మధుమేహం, రక్తమూత్రం, అతి వేడి, ఎండదెబ్బ వంటి వ్యాధులను నియంత్రిస్తుంది. నిమ్మ తొక్కలోని గైలీమోనెన్ పదార్థం చర్మంపై ట్యూమర్స్ రానివ్వదు. ఇన్ఫ్లూయెంజా, న్యూమోనియాలకు నిమ్మరసం మంచిది. కాఫీ డికాషన్లో పాలు పోయకుండా నిమ్మరసం కలిపి ఇస్తే మలేరియా జ్వరం తగ్గుతుంది. ఉప్పుతో నిమ్మరసం కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే చిగుళ్ల వ్యాధులు తగ్గిపోతాయి.