కాలేయానికి ఏదేని నష్టం జరిగితే శరీరమంతా దాని ప్రభావం ఉంటుంది. హెపటైటిస్ వ్యాధి వల్ల కాలేయం బలహీనపడి, పనితీరు స్తంభించి అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాలేయ సిరోసిస్, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్, కాలేయ క్యాన్సర్ 'తదితర జబ్బులు వస్తాయి. కాలేయ వైఫల్యం కారణంగా కొన్నిసార్లు మరణం సంభవిస్తుంది. ఏ వయసు వారిలోనైనా కాలేయ వ్యాధులు రావచ్చు. చాలాసార్లు ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించకుండా వచ్చే ఈ వ్యాధులపై అవగాహన ఉంటే ఆరంభదశలోనే గుర్తించవచ్చు. అప్పుడే సరైన వైద్య చికిత్స అందించడం సాధ్యం అవుతుంది.
కాలేయానికి వచ్చే అనేక సమస్యలల్లో కాలేయవాపు ఒకటి. ఈ వ్యాధి సోకిన వారిలో తక్కువ సమయంలో కాలేయం బాగా వాచిపోతుంది. కాలేయం సైజు పెద్దదైనప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించవు. వాపు వచ్చిన కాలేయం మీద చారికలు రావడం ప్రారంభమౌతుంది. ఆరోగ్యకర కాలేయ కణజాలం స్థానంలో ఈ చారికల కణ జాలం పేరుకుపోతుంది. దీన్నే ఫైబ్రోసిస్ అంటారు. చారికల కణజాలం ఏర్పడితే మీ కాలేయ పని తీరు సరిగ్గా జరగదు. కాబట్టి నిర్దారణ, చికిత్స అవసరం.
సిరోసిస్
కాలేయానికి సోకే అనారోగ్య సమస్యల్లో మరొకటి సిరోసిస్. హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్స్ వల్ల సిరోసిస్ వస్తుంది. స్థూలకాయం, డయాబెటీస్, వైరల్ ఇన్ఫెక్షన్స్, పైత్యకోశం మూసుకుపోవడం, కాపర్, ఐరన్ లోహాలు పేరుకుపోవడం, కొన్ని మందులు వాడటం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. మద్యం ఎక్కువగా తాగడం వల్ల కూడా సిరోసిస్ వస్తుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటివి హెరిడిటి కారణంగా వస్తాయి.
కాలేయ సిరోసిస్ రాను రాను పచ్చకామెర్ల వ్యాధికి దారితీస్తుంది. దీనివల్ల మీ మెదడు, దీర్ఘకాల సిరోసిస్ వచ్చే ప్రమాదముంది. కాలేయ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఆరంభ దశలో దీన్ని గుర్తిస్తే చికిత్స చేయడం సాధ్యం అవుతుంది.
లక్షణాలు
- బరువు తగ్గడం, అలసట, బలహీనత
- వాంతులు, వికారం, వాంతి చేసినప్పు డు రక్తం పడుతుంది. కామెర్లు కలుగుతాయి.
- చీలమండల వాపు ఉంటుంది.
- ఆస్టియోపొరోసిస్, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం
- మలం నలుపు రంగులో ఉంటుంది.
- బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, కడుపులోని రక ్తనాళాలు చిట్లి ప్రేవుల్లో రక్తస్రావం
- అన్నవాహిక పెద్దగా మారడం
- మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపో వడం
- కాలేయ రక్త నాళాల్లో ఒత్తిడి పెరగడం(పోర్టల్ హైపర్‌టెన్షన్) వల్ల మానసికాందోళన
- స్ప హలో ఉన్నప్ప టికీ చంచలత్వంతో ఉంటారు. ఒక్కోసారి కోమా లోకి వెళ్లిపోవడం జరుగుతుంది.
నిర్ధారణ
కాలేయ వ్యాధులు ఉన్నట్లయితే కడుపు వాచిపోతుంది. కళ్లు లేదా శరీరం పచ్చగా లేదా తెల్లగా ఉంటే కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యపరీక్షలు చేయించాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్, యుఎస్‌జి వంటిపరీక్షలు చేయించాలి. వీటితో పాటు సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎండోస్కోపి చేయించాలి. కొన్నిసార్లు కాలేయ బయాప్సీ కూడా అవసరం అవుతుంది. కడుపు నొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యపరీక్షలు చేయించాలి.
జాగ్రత్తలు..
కాలేయం అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. దీనికి ఏదేని సమస్య వస్తే దాని ప్రభావం ఆరోగ్యంపై చాలా ఎక్కువగా ఉంటుంది. హెపటైటిస్ వ్యాధుల వల్ల కాలేయం పనితీరు స్థంభించిపోతుంది. కాలేయం బలహీన పడుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్స్ వాటిల్లుతాయి. తీసుకున్న మందులు, ద్రవాలు, ఆహారం అన్నీ కూడా జీర్ణం కావడా నికి కాలేయం దోహదపడుతుంది.
కాలేయ వ్యాధులు సోకిన చాలా రోజుల వరకు వ్యాధి లక్షణాలు కనిపించవు. వ్యాధి సోకకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
- సింథటిక్ కెమికల్స్‌కి దూరంగా ఉండాలి.
- హెపటైటిస్ బి,సి ఇన్ఫెక్షన్స్ సోకకుండా పరీక్షలు చేసుకోవాలి.
- నాణ్యమైన, శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- టూత్‌బ్రష్‌లు, బ్లేడులు ఒకరివి మరొకరు వాడవద్దు
- అసురక్షిత సెక్స్‌లో పాల్గొన కూడదు.
- మితిమీరి మద్యం సేవించవద్దు.
- హెపటైటిస్ బి, ఎ, నిమోనియా వైరస్లు సోకకుండా వాక్సినేషన్ తీసుకోవాలి. ఏదేని అనుమానం ఉంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా హెపటాలజిస్ట్లను సంప్రదించి తగిన చికిత్స ప్రారంభించాలి.
కాలేయ మార్పిడి
కాలేయ సిరోసిస్ ముదిరిపోయి కోలుకోవడం కష్టంగా ఉంటే వారిలో 50శాతం రోగులు మాత్రమే జీవించగలుగుతున్నారు. మిగతా వారిలో కాలేయ మార్పిడి మాత్రమే దీనికి పరిష్కారం. బ్లడ్ గ్రూప్, దాతల కుటుంబ చరిత్ర కలిస్తే కాలేయ మార్పిడి హెపటాలజిస్ట్ సూచన మేరకు చేసుకోవాలి.
Authorization