చిన్నచిన్న విషయాలకే ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతుంది. ఇందుకు కారణం డిప్రెషన్. వయసు నిమిత్తం లేకుండా అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన మానసిక సమస్య. బాగా కోపంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు స్పీడ్‌గా నడిస్తే పది నిమిషాల్లో మససు సాధారణ స్థితికి వస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో ఇటీవల ప్రచురించిన అధ్యయనాన్ని పరిశీలిస్తే శారీరక వ్యాయమం మానసికారోగ్యానికి ఎంత ముఖ్యమో స్పష్టమవుతుంది. వారానికొకసారి గంట సమయం ఎక్స్ర్సైజులు చేస్తే డిప్రెషన్ లెవల్స్ 44 శాతానికి తగ్గిపోతాయని వెల్లడిస్తున్నారు. పిల్లలకు పనులు చెప్పండి. వారిని అతిగారాబంగా కాకుండా కష్టం తెలిసేలా పెంచితే.. చిన్నచిన్న సమస్యలకు భయపడే మనస్తత్వం నుంచి బయటపడతారు. మానసికంగా బలంగా మారుతారు. జీవితంలో వచ్చే జయాపజయాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది.