మనం తీసుకునే ఆహారంలో జ్ఞాపక శక్తిని పెంచే పదార్థాలు చాలా ఉంటాయి. వాటిని గుర్తించి క్రమం తప్పకుండా డైట్లో చేర్చుకుంటే మతిమరుపు సమస్య నుంచి బయట పడవచ్చు. కొన్నిరకాల జాగ్రత్తలు జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతాయి. నీరు: ఒక్కోసారి డీ హైడ్రేషన్ వల్ల కూడా మెదడు తన శక్తిని కోల్పోతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీరు తాగుతూ ఉండాలి. ఫైబర్: నాడీ కణాలకు గ్లూకోజ్ సప్లరు చేయడంలో ఫైబర్ పాత్ర కీలకమైనది. అన్ని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఖర్జూరాలు, బీన్స్ వంటి వాటిల్లో ఫైబర్ పుష్కలంగా లభ్యమవుతుంది. ప్రోటీన్లు: నాడీ కణాల మధ్య సమన్వయానికి హై టైరీసిన్ ప్రోటీన్లు ఎంతగానో ఉపకరిస్తాయి. గుడ్డు, సముద్రపు ఆహారం, డైరీ ప్రోడక్ట్స్ల్లో ఈ ప్రోటోన్లు దొరకుతాయి. పాలు, నెయ్యి రోజూ డైట్లో ఉండేలా చూసుకోవాలి. విటమిన్స్, మినరల్స్: అన్ని శరీర భాగాల్లాగే మెదడుకు విటమిన్లు, మినరల్స్ అవసరం ఎంతో ఉంది. రోజువారి ఆహారం ద్వారా లభించే విటమిన్లు, ఖనిజాలతోపాటు విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవడం మంచిది. ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు : మనం తీసుకునే ఆహారంలో ఉంటే ఇతర కొవ్వు పదార్థాలతో పోలిస్తే ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయట. ఇవి ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపల నుంచి లభిస్తాయి. అలాగే గుడ్డు, వాల్నట్స్లో కూడా ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు సంత ప్తికరంగా ఉంటాయి. ప్రతిరోజూ గుడ్డు తింటే జ్ఞాపకశక్తి సమస్య రాదు. యాంటీ ఆక్సిడెంట్స్: మెదడును ఫ్రీ-రాడికల్స్ నుంచి కాపాడడానికి యాంటీ ఆక్సిడెంట్స్ క షి చేస్తాయి. గ్రీన్ టీ, స్ట్రాబెర్రీ, బ్రకోలీ, క్యారెట్, వెల్లుల్లి, త ణధాన్యాల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. మనకు అందుబాటులో ఉండే క్యారెట్, వెల్లుల్లి రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి.