ఇటీవల ఎవరినీ పలుకరించినా డిప్రెషన్ అన్న పదం వినిపిస్తుంది. మానసిక సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. డిప్రెషన్‌కు లోనుకావడానికి కారణాలు అనేకం ఉన్నా మనం తీసుకునే ఆహారంతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకే వైద్యుల వద్దకు వెళ్లి సైడ్‌ఎఫెక్ట్‌లు కలిగించే మందులు వాడకుండా సహజసిద్ధంగా కొన్ని ఆహారపదార్ధాలు తీసుకోవడం ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. - పాలలోని లాక్టోస్ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి. నిద్రకు ఉపక్రమించేముందు గోరువెచ్చని పాలు తాగితే హాయిగా నిద్రపోవడంతో పాటు డిప్రెషన్ తగ్గుతుంది. పెరుగులోని విటమిన్ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది. - ఆలుగడ్డలో అధికంగా ఉండే జింక్, విటమిన్ సి రోగని రోధకశక్తి పెంచడంతో పాటు డిప్రెషన్ నుంచి బయటపడేస్తుంది. - అరటిపండులో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్‌ను దూరం చేస్తాయి. రోజూ ఒక అరటిపండు తింటే మానసికాందోళన నుంచే కాదు జీర్ణక్రియ సంబంధమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. - బొప్పాయిలో ఉండే కెరోటిన్ శరీరంలోని విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి డిప్రెషన్ ఇట్టే మాయమవుతుంది. - అన్ని కాలాల్లోనూ లభించే కమలాల్లో అత్యధికంగా ఉండే విటమిన్ సి ఒత్తిడిని కలిగించే హార్మో న్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది. - చేపల్లో అధికంగా లభించే ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు మానసికాందోళనను తగ్గిస్తాయి.